Nene vodambarase nelamtam gomtavadigi

నేనే వొడఁబరచే నెలఁతఁ గొంతవడికి
Language

(॥పల్లవి॥)
నేనే వొడఁబరచే నెలఁతఁ గొంతవడికి
నానితేనే మెత్తనయ్యీ నవ్వకురే మీరు

(॥నేనే॥)
మనసు లోపలి వేద మాటల లోపలివూద
కనుఁగొనలనే గోద కానరాదా
వనిత యిప్పుడేమన్న వాదులకే వచ్చుఁగాని
వినదు మీమాటలెల్ల విడువడరే

(॥నేనే॥)
కాయము మీఁదటి కాఁక కడునిట్టూర్పులమూఁక
చేయి చెక్కుమీఁది వీఁక సేసె నిందాఁక
యీయెడఁ జెలి నేమన్న నీసడించఁ జూచుఁగాని
చాయకు రాదు మీచేఁత చాలుఁజాలునే

(॥నేనే॥)
గుబ్బలపై మెరుఁగూ గుణుములలో కరఁగూ
వుబ్బురతితెఱఁగూ వుని దెఱుఁగూ
గొబ్బనఁ గూడితి నిట్టె కోరి శ్రీవేంకటేశుఁడ
అబ్బురపు తొఁటిమాట లాయనాయనే

(||pallavi||)
nene vŏḍam̐barase nĕlam̐tam̐ gŏṁtavaḍigi
nānidene mĕttanayyī navvagure mīru

(||nene||)
manasu lobali veda māḍala lobalivūda
kanum̐gŏnalane goda kānarādā
vanida yippuḍemanna vādulage vachchum̐gāni
vinadu mīmāḍalĕlla viḍuvaḍare

(||nene||)
kāyamu mīm̐daḍi kām̐ka kaḍuniṭṭūrbulamūm̐ka
seyi sĕkkumīm̐di vīm̐ka sesĕ niṁdām̐ka
yīyĕḍam̐ jĕli nemanna nīsaḍiṁcham̐ jūsum̐gāni
sāyagu rādu mīsem̐ta sālum̐jālune

(||nene||)
gubbalabai mĕrum̐gū guṇumulalo karam̐gū
vubburadidĕṟam̐gū vuni dĕṟum̐gū
gŏbbanam̐ gūḍidi niṭṭĕ kori śhrīveṁkaḍeśhum̐ḍa
abburabu tŏm̐ṭimāḍa lāyanāyane