Nene tappu sese namte neevu maanubamgalavaa

నేనే తప్పు సేసే నంటే నీవు మానుపఁగలవా
Language

(॥పల్లవి॥)
నేనే తప్పు సేసే నంటే నీవు మానుపఁగలవా
మోనముతో నే నూరకే మొక్కేఁ గాని

(॥నేనే॥)
నవ్వు నవ్వ నెంతలేదు నడుమ నీ మాటలకు
చివ్వన నిన్నింత గోరసేయఁగాని
రవ్వసేయ నేమి దొడ్డు రచ్చల నీసేఁతలకు
పువ్వువలె గుట్టు సేసి పొదిగేఁ గాని

(॥నేనే॥)
సాదించ నెంతలేదు సరుస నీవిద్యలకు
భేదము లే కల్లిబిల్లె పెనఁగేఁగాని
సోదించ నెంతలేదు సొరిది నీమేనెల్లా
కాదుగూడ దనక నేఁ గాఁగిలించేఁగాని

(॥నేనే॥)
చక్కఁబెట్టి నెంతలేదు సారెకు నీగుణా లెల్లా
కక్కసించగా కందముఁ గైకొనేఁగాని
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మిక్కిలి నిన్నింక నిట్టె మెచ్చేఁగాని

(||pallavi||)
nene tappu sese naṁṭe nīvu mānubam̐galavā
monamudo ne nūrage mŏkkem̐ gāni

(||nene||)
navvu navva nĕṁtaledu naḍuma nī māḍalagu
sivvana ninniṁta goraseyam̐gāni
ravvaseya nemi dŏḍḍu rachchala nīsem̐talagu
puvvuvalĕ guṭṭu sesi pŏdigem̐ gāni

(||nene||)
sādiṁcha nĕṁtaledu sarusa nīvidyalagu
bhedamu le kallibillĕ pĕnam̐gem̐gāni
sodiṁcha nĕṁtaledu sŏridi nīmenĕllā
kādugūḍa danaga nem̐ gām̐giliṁchem̐gāni

(||nene||)
sakkam̐bĕṭṭi nĕṁtaledu sārĕgu nīguṇā lĕllā
kakkasiṁchagā kaṁdamum̐ gaigŏnem̐gāni
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
mikkili ninniṁka niṭṭĕ mĕchchem̐gāni