నేనే పిలువ ననే నేర మేమి గలిగినా
(॥పల్లవి॥)
నేనే పిలువ ననే నేర మేమి గలిగినా
దీన నైన తప్పు మీఁద దిద్దుకొనేఁ గాని
(॥నేనే॥)
వలపు బలిమి సేసి వంతకుఁ బెనఁగఁ బోతే
చలువలే వేఁ డౌను సతులాల
వెల నున్నరమణుని వేడుక నేఁ బిలిచితే
చులుకఁదనము రాదా చూడఁ గానె యిపుడూ
(॥నేనే॥)
మనసు రానిచోట మాటలఁ గొసరఁ బోతే
చన వెల్లాఁ జవి దప్పు జాణలాల
ననుపు లేనిపతితో నవ్వులు నవ్వఁగఁ బేతే
పని మాలినది గాదా పై పైనె యిపుడూ
(॥నేనే॥)
దరదరిఁ గాక నే దగ్గరి కూడఁగఁ బోతే
సరసమే విరస మౌ సకియలాల
యిర వై శ్రీవెంకటేశుఁ డిట్టె విచ్చేసి కూడె
దొరతన మిది గాదా తుద కెక్కె నిపుడూ
(||pallavi||)
nene piluva nane nera memi galiginā
dīna naina tappu mīm̐da diddugŏnem̐ gāni
(||nene||)
valabu balimi sesi vaṁtagum̐ bĕnam̐gam̐ bode
saluvale vem̐ ḍaunu sadulāla
vĕla nunnaramaṇuni veḍuga nem̐ biliside
sulugam̐danamu rādā sūḍam̐ gānĕ yibuḍū
(||nene||)
manasu rānisoḍa māḍalam̐ gŏsaram̐ bode
sana vĕllām̐ javi dappu jāṇalāla
nanubu lenibadido navvulu navvam̐gam̐ bede
pani mālinadi gādā pai painĕ yibuḍū
(||nene||)
daradarim̐ gāga ne daggari kūḍam̐gam̐ bode
sarasame virasa mau sagiyalāla
yira vai śhrīvĕṁkaḍeśhum̐ ḍiṭṭĕ vichchesi kūḍĕ
dŏradana midi gādā tuda kĕkkĕ nibuḍū