Nene neevai vumdamgaanu nemdu neegugaa nitte

నేనే నీవై వుండఁగాను నేఁడు నీకుగా నిట్టే
Language

(॥పల్లవి॥)
నేనే నీవై వుండఁగాను నేఁడు నీకుగా నిట్టే
పూనుక రా కెటువలెఁ బొంచి వుందు నేను

(॥॥)
వూరఁగల సతులు నిన్నొడివట్టి తియ్యఁగాను
దూరక నిన్నిట్టే చూతును నేను
వోరి యని కన్నదెల్లా నొకటొకటే యాడఁగ
వారక నేఁడిపు డెటువలె విందు నేను

(॥॥)
వాడవారెల్లా నీ పై వసంతాలు చల్లఁగాను
వోడక నిన్నుప్పగించుకుందునా నేనూ
వేడుక కెవ్వరైనాను వెస నీ తొడ లెక్కఁగా
కూడి యెట్టు వహించుకోకుండుదు నేను

(॥॥)
సంత కూటపు వారెల్లా సారె నీమే నంటఁగాను
పొంత నడ్డము రా కెట్టు పోనిత్తు నేను
యింత లో శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
సంతోసించుకొంటి నిఁక సాదింతునా నేను

(||pallavi||)
nene nīvai vuṁḍam̐gānu nem̐ḍu nīgugā niṭṭe
pūnuga rā kĕḍuvalĕm̐ bŏṁchi vuṁdu nenu

(||||)
vūram̐gala sadulu ninnŏḍivaṭṭi tiyyam̐gānu
dūraga ninniṭṭe sūdunu nenu
vori yani kannadĕllā nŏgaḍŏgaḍe yāḍam̐ga
vāraga nem̐ḍibu ḍĕḍuvalĕ viṁdu nenu

(||||)
vāḍavārĕllā nī pai vasaṁtālu sallam̐gānu
voḍaga ninnuppagiṁchuguṁdunā nenū
veḍuga kĕvvarainānu vĕsa nī tŏḍa lĕkkam̐gā
kūḍi yĕṭṭu vahiṁchugoguṁḍudu nenu

(||||)
saṁta kūḍabu vārĕllā sārĕ nīme naṁṭam̐gānu
pŏṁta naḍḍamu rā kĕṭṭu ponittu nenu
yiṁta lo śhrī veṁkaḍeśha yiṭṭe nannu nelidivi
saṁtosiṁchugŏṁṭi nim̐ka sādiṁtunā nenu