Nene nee valalam badi neranaidim gaaga yimta

నేనే నీ వలలఁ బడి నేరనైతిఁ గాక యింత
Language

(॥పల్లవి॥)
నేనే నీ వలలఁ బడి నేరనైతిఁ గాక యింత
మేనరికము చెప్పితే మెచ్చవా మమ్మును

(॥నేనే॥)
తలఁతువు గాక నీవు దవ్వుల నుండినవారిఁ
యలరి వద్ద నున్న నే మంత సరకా
అలిగినసతులకే అంతకూ మొక్కుదు గాక
కలసి యిచ్చ లాడితేఁ గైకొనేవా మమ్మును

(॥నేనే॥)
యెదురుచూతువు గాక యెరవులవారికే
వదలక యింటివారివంక చూచేవా
చెదరక తరితీపు సేసేవారే చవి గాక
పదరితే సులభానఁ బైకొనేవా మమ్మును

(॥నేనే॥)
పొగడుదు వింతేకాక పోరచివారిమాటలు
తగవైనా మామాఁ టలు తగు ననేవా
నగుతా శ్రీ వేంకటేశ నన్ను నిట్టె కూడితివి
జిగి నింత సేయకున్నఁ జెనకేవా మమ్మును

(||pallavi||)
nene nī valalam̐ baḍi neranaidim̐ gāga yiṁta
menarigamu sĕppide mĕchchavā mammunu

(||nene||)
talam̐tuvu gāga nīvu davvula nuṁḍinavārim̐
yalari vadda nunna ne maṁta saragā
aliginasadulage aṁtagū mŏkkudu gāga
kalasi yichcha lāḍidem̐ gaigŏnevā mammunu

(||nene||)
yĕdurusūduvu gāga yĕravulavārige
vadalaga yiṁṭivārivaṁka sūsevā
sĕdaraga taridību sesevāre savi gāga
padaride sulabhānam̐ baigŏnevā mammunu

(||nene||)
pŏgaḍudu viṁtegāga porasivārimāḍalu
tagavainā māmām̐ ṭalu tagu nanevā
nagudā śhrī veṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
jigi niṁta seyagunnam̐ jĕnagevā mammunu