Nene koolam gaani veemdu nerajaanamde

నేనె కూళఁ గాని వీఁడు నెరజాణఁడే
Language

(॥పల్లవి॥)
నేనె కూళఁ గాని వీఁడు నెరజాణఁడే
తానె నావెంటవెంటఁ దగిలీనె వీఁడు

(॥నేనె॥)
మన్ననలు నాకు నిచ్చిన మరి నే నెంత దూరిన
కన్నులనె నవ్వు నవ్వీఁ గదవే వీఁడు
సన్న లెరఁగక నేనె సారెఁ దమకింతుఁ గాని
పన్ని నే నెం తలిగినఁ బదరఁడే వీఁడు

(॥నేనె॥)
యిచ్చకము నాకుఁ జేసి యెంత నే నలిగినాను
బచ్చనల నావద్దఁ బాయఁడే వీఁడు
కుచ్చతాన నేనె తన్నుఁ గొంగు వట్ట నియ్యఁ గాని
విచ్చనవడిఁ దా నైతే వేఁడుకొనీనె వీఁడు

(॥నేనె॥)
తాలిమితోడను నేఁ దల వంచుకుండినాను
కేలు చాఁచి నన్ను బుజ్జగించీనె వీఁడు
వే ళెరిఁగి రతుల శ్రీవెంకటేశుఁడిట్టె కూడె
నాలి దీర నన్నిట్టె నమ్మించెనే వీఁడు

(||pallavi||)
nenĕ kūḽam̐ gāni vīm̐ḍu nĕrajāṇam̐ḍe
tānĕ nāvĕṁṭavĕṁṭam̐ dagilīnĕ vīm̐ḍu

(||nenĕ||)
mannanalu nāgu nichchina mari ne nĕṁta dūrina
kannulanĕ navvu navvīm̐ gadave vīm̐ḍu
sanna lĕram̐gaga nenĕ sārĕm̐ damagiṁtum̐ gāni
panni ne nĕṁ taliginam̐ badaram̐ḍe vīm̐ḍu

(||nenĕ||)
yichchagamu nāgum̐ jesi yĕṁta ne naliginānu
bachchanala nāvaddam̐ bāyam̐ḍe vīm̐ḍu
kuchchadāna nenĕ tannum̐ gŏṁgu vaṭṭa niyyam̐ gāni
vichchanavaḍim̐ dā naide vem̐ḍugŏnīnĕ vīm̐ḍu

(||nenĕ||)
tālimidoḍanu nem̐ dala vaṁchuguṁḍinānu
kelu sām̐si nannu bujjagiṁchīnĕ vīm̐ḍu
ve ḽĕrim̐gi radula śhrīvĕṁkaḍeśhum̐ḍiṭṭĕ kūḍĕ
nāli dīra nanniṭṭĕ nammiṁchĕne vīm̐ḍu