నేనే కాదు చెలు లెల్ల నీ గుణ మెరుఁగుదురు
(॥పల్లవి॥)
నేనే కాదు చెలు లెల్ల నీ గుణ మెరుఁగుదురు
నానిన వలపు చెప్ప నాతో నేల యిఁకనూ
(॥నేనే॥)
మంతనాన మీ రిద్దరు మచ్చిక ముచ్చ టాడఁగ
వింతలుగా మీ సుద్దులు విననా నేను
యింతలో నే నగిగితే యేరుపడఁ గత చెప్పే
వంతరంగ మెఱఁగదా ఆన లేల యిఁకను
(॥నేనే॥)
మొదలనె మీకళల మొకములలో తేట
కదిసి చూచితి నిట్టె కానాన నేను
అదన నే నవ్వితేను అట్టె తెర వేసేవు
కదిమి నాతో నయగార మేల యిఁకను
(॥నేనే॥)
పచ్చి గాఁగ నింటిలోన పానుపుపైఁ గూడినది
యెచ్చరికె లెరఁగనా యిప్పుడే నేను
అచ్చపు శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితిని
ముచ్చిమి దీరినమీఁద మొక్కు లేల యిఁకను
(||pallavi||)
nene kādu sĕlu lĕlla nī guṇa mĕrum̐guduru
nānina valabu sĕppa nādo nela yim̐kanū
(||nene||)
maṁtanāna mī riddaru machchiga muchcha ṭāḍam̐ga
viṁtalugā mī suddulu vinanā nenu
yiṁtalo ne nagigide yerubaḍam̐ gada sĕppe
vaṁtaraṁga mĕṟam̐gadā āna lela yim̐kanu
(||nene||)
mŏdalanĕ mīgaḽala mŏgamulalo teḍa
kadisi sūsidi niṭṭĕ kānāna nenu
adana ne navvidenu aṭṭĕ tĕra vesevu
kadimi nādo nayagāra mela yim̐kanu
(||nene||)
pachchi gām̐ga niṁṭilona pānububaim̐ gūḍinadi
yĕchcharigĕ lĕram̐ganā yippuḍe nenu
achchabu śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidini
muchchimi dīrinamīm̐da mŏkku lela yim̐kanu