నేనే దయదలఁచ నేరనైతి నింతెకాక
(॥పల్లవి॥)
నేనే దయదలఁచ నేరనైతి నింతెకాక
యీ నటనే చూపవలె నిటువంటివానికి
(॥నేనే॥)
పంతపు నీగుణము పట్టితే బిగుసుఁగాక
యెంతైనానాయ నాకు యియ్యకోలౌనా
చెంతల నేఁ దరితీపు సేసి ముందే అలిగితే
యింతక నాచెప్పినట్టు యేమైనాఁ జేయవా
(॥నేనే॥)
చంచలపునీమది కొంచెములే వెదకుఁ గాక
వంచుకొంటే మాకు నిఁక వసమయ్యీనా
అంచల నే నవ్వుతానే అడియాసఁ దిప్పితేను
పంచలఁ గాచుక నీవు బంటువలె నుండవా
(॥నేనే॥)
కాతరపు నీవలపు కక్కూరితి సేసుఁ గాక
మాతలఁపు కొలఁదిని మట్టుపడీనా
యేతుల శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
యీతలఁపు నాఁడే యైతే యేలికవై వుండవా
(||pallavi||)
nene dayadalam̐sa neranaidi niṁtĕgāga
yī naḍane sūbavalĕ niḍuvaṁṭivānigi
(||nene||)
paṁtabu nīguṇamu paṭṭide bigusum̐gāga
yĕṁtainānāya nāgu yiyyagolaunā
sĕṁtala nem̐ daridību sesi muṁde aligide
yiṁtaga nāsĕppinaṭṭu yemainām̐ jeyavā
(||nene||)
saṁchalabunīmadi kŏṁchĕmule vĕdagum̐ gāga
vaṁchugŏṁṭe māgu nim̐ka vasamayyīnā
aṁchala ne navvudāne aḍiyāsam̐ dippidenu
paṁchalam̐ gāsuga nīvu baṁṭuvalĕ nuṁḍavā
(||nene||)
kādarabu nīvalabu kakkūridi sesum̐ gāga
mādalam̐pu kŏlam̐dini maṭṭubaḍīnā
yedula śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
yīdalam̐pu nām̐ḍe yaide yeligavai vuṁḍavā