Nene buddiseppugone nerubunam badigini

నేనే బుద్దిచెప్పుకొనే నేరుపునఁ బతికిని
Language

(॥పల్లవి॥)
నేనే బుద్దిచెప్పుకొనే నేరుపునఁ బతికిని
దానికేమి యింతలోనె తానే నన్నునేలెను

(॥॥)
మగవాఁడు మేరిమీరి మగువలఁ జెనకితే
తగవులఁ బెట్టనేల తడవకువే
మొగమోటయినచోట మోనాన నుండుటమేలు
పగటున మిగులాను బలిమిసేయకువే

(॥॥)
పాయపువాఁడు మిక్కిలి పరచై తిరిగితేను
బాయిట వేయఁగనేల పదరకువే
తోయరానిచుట్టముతో చాయనేసుకొంటే మేలు
రాయడించి సారెసారె రచ్చలఁబెట్టుకువే

(॥॥)
శ్రీవేంకటేశ్వరుఁడు సిగ్గులు విడిచితేను
కావరించి నవ్వనేల కదుమకువే
వావులెనసిన చోట వదలకుండట మేలు
నీ వలమేల్మంగ కూడి నెలవైపాయకువే

(||pallavi||)
nene buddisĕppugŏne nerubunam̐ badigini
dānigemi yiṁtalonĕ tāne nannunelĕnu

(||||)
magavām̐ḍu merimīri maguvalam̐ jĕnagide
tagavulam̐ bĕṭṭanela taḍavaguve
mŏgamoḍayinasoḍa monāna nuṁḍuḍamelu
pagaḍuna migulānu balimiseyaguve

(||||)
pāyabuvām̐ḍu mikkili parasai tirigidenu
bāyiḍa veyam̐ganela padaraguve
toyarānisuṭṭamudo sāyanesugŏṁṭe melu
rāyaḍiṁchi sārĕsārĕ rachchalam̐bĕṭṭuguve

(||||)
śhrīveṁkaḍeśhvarum̐ḍu siggulu viḍisidenu
kāvariṁchi navvanela kadumaguve
vāvulĕnasina soḍa vadalaguṁḍaḍa melu
nī valamelmaṁga kūḍi nĕlavaibāyaguve