Nene bhaagyavamtumdanu nee krpa galige naagu

నేనే భాగ్యవంతుఁడను నీ కృప గలిగె నాకు
Language

(॥పల్లవి॥)
నేనే భాగ్యవంతుఁడను నీ కృప గలిగె నాకు
జ్ఞాన మిచ్చితివి నే సంసారము సేయఁగాను

(॥నేనే॥)
వుట్టుదరిద్రుఁడై వున్నప్పుడు వచ్చిన సంపద
లట్టే వేఁపచేఁదు దాగెయప్పటి తీపు
దట్టమై యాకలిగొన్నతఱిఁ గల యాహారము
గట్టిగాఁ జవియైనట్టు గలిగె నీ భక్తి

(॥నేనే॥)
చిక్కులేక భీతివాసినమీది సంతోషము
నిక్కపు రోగము మానిన సౌఖ్యము
మిక్కలి యప్పులు దీని మెఱనే దొరతనము
గక్కన నా కబ్బినట్టు గలిగె నీ భక్తి

(॥నేనే॥)
జడిసి యెండదాఁకిని సమయమందలి నీడ
అడవిలోపల సహాయమైన తోడు
అడరి దొరకినట్టు లట్టే శ్రీవేంకటేశ
కడఁగి నీ కృపవల్లఁ గలిగె నీ భక్తి

(||pallavi||)
nene bhāgyavaṁtum̐ḍanu nī kṛpa galigĕ nāgu
jñāna michchidivi ne saṁsāramu seyam̐gānu

(||nene||)
vuṭṭudaridrum̐ḍai vunnappuḍu vachchina saṁpada
laṭṭe vem̐pasem̐du dāgĕyappaḍi tību
daṭṭamai yāgaligŏnnadaṟim̐ gala yāhāramu
gaṭṭigām̐ javiyainaṭṭu galigĕ nī bhakti

(||nene||)
sikkulega bhīdivāsinamīdi saṁtoṣhamu
nikkabu rogamu mānina saukhyamu
mikkali yappulu dīni mĕṟane dŏradanamu
gakkana nā kabbinaṭṭu galigĕ nī bhakti

(||nene||)
jaḍisi yĕṁḍadām̐kini samayamaṁdali nīḍa
aḍavilobala sahāyamaina toḍu
aḍari dŏraginaṭṭu laṭṭe śhrīveṁkaḍeśha
kaḍam̐gi nī kṛpavallam̐ galigĕ nī bhakti