Nene bhaagyamamturaala ni nnemani pogadenu

నేనే భాగ్యమంతురాల ని న్నేమని పొగడేను
Language

(॥పల్లవి॥)
నేనే భాగ్యమంతురాల ని న్నేమని పొగడేను
పూని నేఁ దలఁచఁగానే బోరున వచ్చితివి

(॥॥)
వేడుక నా మది లోని విరహపు కాఁక మాన్పు
జాడతో నీ సెలవి పై చల్లని నవ్వు
వాడలో నిన్నెనసిన వట్టి తహతహ మాన్పు
వీడెపు నీ మోవి తోడి వింత వింత మాటలూ

(॥॥)
అగపడి నీవు రాని ఆందోళ మెల్ల మాన్పు
తగిలి ననుఁ జూచే నీ దయ చూపు
చిగిరించే నా మై కన్యసిగ్గు లెల్లా మానుపు
సొగిసి నీ కొనగోరి సోఁకుల చెనకులు

(॥॥)
మునుకొని నేఁ గోరే ముచ్చటెల్లా మానుపు
ననిచి నన్నుఁ గూడే మన్నన కౌఁగిలి
యెనసితి వీలాగున యిట్టే శ్రీ వేంకటేశ
దినదిన భోగాలఁ దీరవు నీ రతులూ

(||pallavi||)
nene bhāgyamaṁturāla ni nnemani pŏgaḍenu
pūni nem̐ dalam̐sam̐gāne boruna vachchidivi

(||||)
veḍuga nā madi loni virahabu kām̐ka mānpu
jāḍado nī sĕlavi pai sallani navvu
vāḍalo ninnĕnasina vaṭṭi tahadaha mānpu
vīḍĕbu nī movi toḍi viṁta viṁta māḍalū

(||||)
agabaḍi nīvu rāni āṁdoḽa mĕlla mānpu
tagili nanum̐ jūse nī daya sūbu
sigiriṁche nā mai kanyasiggu lĕllā mānubu
sŏgisi nī kŏnagori som̐kula sĕnagulu

(||||)
munugŏni nem̐ gore muchchaḍĕllā mānubu
nanisi nannum̐ gūḍe mannana kaum̐gili
yĕnasidi vīlāguna yiṭṭe śhrī veṁkaḍeśha
dinadina bhogālam̐ dīravu nī radulū