(॥పల్లవి॥)
నేననఁగ నెంతదాన నీపాలికి
చేనిపంట కొయ్యెలే చెప్పీ చెప్పవయ్య బుద్దులు
(॥నేనన॥)
మచ్చిక నే జల్లఁగానే మాటలాడ వచ్చేవు
ఇచ్చకుఁడ ఇందాఁక నెందువోతివి
తచ్చనకాఁడవు నీవు తగులువిరులాడేవు
నచ్చులగొల్లెత లెట్టు నమ్మిరయ్య నిన్నును
(॥నేన॥)
పైకొని నేఁ బిలువఁగ పలుకఁగ వచ్చేవు
చాకలవాఁడవు ముంచవద్దా నీవు
కాకరివాఁడవు మాతో గాలి ముడియగట్టేవు
చేకొని నీచెలి మెట్టు చేసిరయ్య సతులు
(॥నేస॥)
మించి నేఁ గూడఁగానే మెచ్చులెల్లా మెచ్చేవు
మంచముపై నుండి యేల మరచుంటివి
చంచులశ్రీవేంకటేశ సందుసుడి మెలఁగేవు
యెంచ నిన్నెట్టు గెలిచి రిన్నాళ్లు నింతులు
(||pallavi||)
nenanam̐ga nĕṁtadāna nībāligi
senibaṁṭa kŏyyĕle sĕppī sĕppavayya buddulu
(||nenana||)
machchiga ne jallam̐gāne māḍalāḍa vachchevu
ichchagum̐ḍa iṁdām̐ka nĕṁduvodivi
tachchanagām̐ḍavu nīvu taguluvirulāḍevu
nachchulagŏllĕda lĕṭṭu nammirayya ninnunu
(||nena||)
paigŏni nem̐ biluvam̐ga palugam̐ga vachchevu
sāgalavām̐ḍavu muṁchavaddā nīvu
kāgarivām̐ḍavu mādo gāli muḍiyagaṭṭevu
segŏni nīsĕli mĕṭṭu sesirayya sadulu
(||nesa||)
miṁchi nem̐ gūḍam̐gāne mĕchchulĕllā mĕchchevu
maṁchamubai nuṁḍi yela marasuṁṭivi
saṁchulaśhrīveṁkaḍeśha saṁdusuḍi mĕlam̐gevu
yĕṁcha ninnĕṭṭu gĕlisi rinnāḽlu niṁtulu