నేనంటే నేమాయె నేఁడు తన కెగ్గా
(॥పల్లవి॥)
నేనంటే నేమాయె నేఁడు తన కెగ్గా
దాని కేమే నాటివాఁడు తాఁ దానే కాఁడా
(॥నేనం॥)
తిట్టితే నేమాయెనే తెగి శిశుపాలుచేత
తిట్టులి బడినయట్టి దేవరేకాఁడా
ముట్టితే నేమాయెఁ దనముంగురులు రోలితోడ
ముట్టి కట్టు వడ్డపోల ముద్దులాఁడుగాఁడా
(॥నేనం॥)
కాలు దాఁకితే నేమాయె కమ్మర భృగువుచేత
కాలఁ దన్నించుకొనిన ఘనుఁడే కాఁడా
పేలవానఁ బొత్తుకు నేఁ బిలిచితే నేమాయె
కోలల గొల్లల పొత్తు కుడవఁడా తాను
(॥నేనం॥)
మొన నా చనుఁగొండలు మోపితే నేమాయె
ననిచి వేలఁ గొండ నాఁడు మోవఁడా
యెనసి శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
వెనకకుఁ గూడిన నా విభుఁడే కాఁడా
(||pallavi||)
nenaṁṭe nemāyĕ nem̐ḍu tana kĕggā
dāni keme nāḍivām̐ḍu tām̐ dāne kām̐ḍā
(||nenaṁ||)
tiṭṭide nemāyĕne tĕgi śhiśhubāluseda
tiṭṭuli baḍinayaṭṭi devaregām̐ḍā
muṭṭide nemāyĕm̐ danamuṁgurulu rolidoḍa
muṭṭi kaṭṭu vaḍḍabola muddulām̐ḍugām̐ḍā
(||nenaṁ||)
kālu dām̐kide nemāyĕ kammara bhṛguvuseda
kālam̐ danniṁchugŏnina ghanum̐ḍe kām̐ḍā
pelavānam̐ bŏttugu nem̐ biliside nemāyĕ
kolala gŏllala pŏttu kuḍavam̐ḍā tānu
(||nenaṁ||)
mŏna nā sanum̐gŏṁḍalu mobide nemāyĕ
nanisi velam̐ gŏṁḍa nām̐ḍu movam̐ḍā
yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
vĕnagagum̐ gūḍina nā vibhum̐ḍe kām̐ḍā