Nenamta nishtoorim gaanu nee yedagu

నేనంత నిష్టూరిఁ గాను నీ యెడకు
Language

(॥పల్లవి॥)
నేనంత నిష్టూరిఁ గాను నీ యెడకు
కానున్న పనులే నీపై గట్టియాయఁ జుమ్మీ

(॥నేనం॥)
చిత్తములోని దాన నీవు చెప్పినట్టు సేతు
చూచి చూచి నిన్ను నెట్టు సోఁకనాడేను
యేచి నీవు పట్టపగ లీపె నీవు నున్నందుకు
రా చిలుకలే మిమ్ము రవ్వసేసెఁ జుమ్మీ

(॥నేనం॥)
తగులైనదాన నీకు తపము సేయుచుండుదు
వెగటుగ నీతో నేఁడు వెంగెమాడేనా
జిగి నాపెతో నీవు సేసిన సన్న లివ్వల
పగటునద్దము నిదె పట్టి యిచ్చెఁ జుమ్మీ

(॥నేనం॥)
కూడిన కాఁగిటిదాన కోరి నీ కిచ్చ లాడుదు
వాడిక రతుల నిన్ను వంచుకొనేనా
యీడనె శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
వీడెపు నీ మోవి వెల్లా విరిసేసెఁ జుమ్మీ

(||pallavi||)
nenaṁta niṣhṭūrim̐ gānu nī yĕḍagu
kānunna panule nībai gaṭṭiyāyam̐ jummī

(||nenaṁ||)
sittamuloni dāna nīvu sĕppinaṭṭu sedu
sūsi sūsi ninnu nĕṭṭu som̐kanāḍenu
yesi nīvu paṭṭabaga lībĕ nīvu nunnaṁdugu
rā silugale mimmu ravvasesĕm̐ jummī

(||nenaṁ||)
tagulainadāna nīgu tabamu seyusuṁḍudu
vĕgaḍuga nīdo nem̐ḍu vĕṁgĕmāḍenā
jigi nābĕdo nīvu sesina sanna livvala
pagaḍunaddamu nidĕ paṭṭi yichchĕm̐ jummī

(||nenaṁ||)
kūḍina kām̐giḍidāna kori nī kichcha lāḍudu
vāḍiga radula ninnu vaṁchugŏnenā
yīḍanĕ śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
vīḍĕbu nī movi vĕllā virisesĕm̐ jummī