Nenaide nemee neramga neegu neeve bedarevu

నేనైతే నేమీ నెరఁగ నీకు నీవే బెదరేవు
Language

(॥పల్లవి॥)
నేనైతే నేమీ నెరఁగ నీకు నీవే బెదరేవు
తానే బయటఁ బడీని తగని నీ చేఁతలు

(॥నేనైతే॥)
కొండవంటి దొర నిన్నుఁ గోరి వెంగె మాడుదునా
దుండుగము నీకు నీకే తోఁచీఁ గాకా
అండకు వచ్చి నీ గట్టు అరయఁగ వచ్చితినా
వుండుండి నీకు నీవే వులికేవు గాక

(॥నేనైతే॥)
నడుమను నిన్నుఁ జూచి నవ్వులు నవ్వితివా
వడి నీకు నీవే తల వంచేవు గాక
వెడ నీ మేనిచేఁతలు వెదకి చూచితినా
తడవి కప్పుక నీవే దాఁచేవు గాక

(॥నేనైతే॥)
నీవు గాఁగిలించుకోఁగా నేరము లెంచితినా
భావించ నీవే సిగ్గు వడేవు గాక
యీవేళ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కోవిదుఁడ వై రతిఁ గొంకేవు గాకా

(||pallavi||)
nenaide nemī nĕram̐ga nīgu nīve bĕdarevu
tāne bayaḍam̐ baḍīni tagani nī sem̐talu

(||nenaide||)
kŏṁḍavaṁṭi dŏra ninnum̐ gori vĕṁgĕ māḍudunā
duṁḍugamu nīgu nīge tom̐sīm̐ gāgā
aṁḍagu vachchi nī gaṭṭu arayam̐ga vachchidinā
vuṁḍuṁḍi nīgu nīve vuligevu gāga

(||nenaide||)
naḍumanu ninnum̐ jūsi navvulu navvidivā
vaḍi nīgu nīve tala vaṁchevu gāga
vĕḍa nī menisem̐talu vĕdagi sūsidinā
taḍavi kappuga nīve dām̐sevu gāga

(||nenaide||)
nīvu gām̐giliṁchugom̐gā neramu lĕṁchidinā
bhāviṁcha nīve siggu vaḍevu gāga
yīveḽa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kovidum̐ḍa vai radim̐ gŏṁkevu gāgā