Nenaide neederudu neegu leelaa maatra mimte

నేనైతే నీడేరుదు నీకు లీలా మాత్ర మింతే
Language

(॥పల్లవి॥)
నేనైతే నీడేరుదు నీకు లీలా మాత్ర మింతే
మానక నన్నేలుకొమ్మి మాధవ గోవిందా

(॥నేనై॥)
నీవు నన్ను మన్నించితే నీ మహిమలోఁ గొంత
యీవల వెలితి యౌనా యీ లోభ మేలా
కావించి పాలజలధికడ నొక్క తుంపురు
వేవేగ విదలించితే వెలితి యెందులకు

(॥నేనై॥)
వెడకర్మినైనా నన్ను వెనక వేసుకొంటేను
గొడవ నీకు వచ్చీనా కొంక నేఁటికి
గడుసు దొంగైన వాఁడొకఁడు కొండలో దాఁగితే
యెడ మిచ్చినకొండకు హీన మయ్యీనా

(॥నేనై॥)
కందువ శ్రీ వేంకటేశ కరుణారసము నాపై
చిందరాదా అనుమాన చింత లేఁటికి
యిందరిపై సూర్యుఁడు యెండలు గాసితేను
అందుకొన్ని కిరణాలు ఆరగిపోయీనా

(||pallavi||)
nenaide nīḍerudu nīgu līlā mātra miṁte
mānaga nannelugŏmmi mādhava goviṁdā

(||nenai||)
nīvu nannu manniṁchide nī mahimalom̐ gŏṁta
yīvala vĕlidi yaunā yī lobha melā
kāviṁchi pālajaladhigaḍa nŏkka tuṁpuru
vevega vidaliṁchide vĕlidi yĕṁdulagu

(||nenai||)
vĕḍagarminainā nannu vĕnaga vesugŏṁṭenu
gŏḍava nīgu vachchīnā kŏṁka nem̐ṭigi
gaḍusu dŏṁgaina vām̐ḍŏgam̐ḍu kŏṁḍalo dām̐gide
yĕḍa michchinagŏṁḍagu hīna mayyīnā

(||nenai||)
kaṁduva śhrī veṁkaḍeśha karuṇārasamu nābai
siṁdarādā anumāna siṁta lem̐ṭigi
yiṁdaribai sūryum̐ḍu yĕṁḍalu gāsidenu
aṁdugŏnni kiraṇālu āragiboyīnā