Nemu vachchi tadavaaya nee jaagemtainaam gaddu

నేము వచ్చి తడవాయ నీ జాగెంతైనాఁ గద్దు
Language

(॥పల్లవి॥)
నేము వచ్చి తడవాయ నీ జాగెంతైనాఁ గద్దు
రామ వద్దికి నిప్పుడే రాఁగదవయ్యా

(॥నేము॥)
మాపుదాఁకా నీతోను మాటలాడనే పట్టె
యేపొద్దు చెలియవద్ది కేఁగేదయ్యా
చూపుల నీసింగారాలు చూడనే యిందాఁకాఁబట్టె
ఆపె వూడిగాన నెప్పుడండనుండేమయ్యా

(॥నేము॥)
కాచుకుండి నీ కిందాఁకాఁ గానుకలియ్యనే పట్టె
ఆ చెలితో మారుమాటేమనేమయ్యా
చేచేత నీ చేఁతలకు సెలవినవ్వనే పట్టె
చూచి యాపెతో నేపొద్దు జూజమాడేమయ్యా

(॥నేము॥)
రాజసపు నిన్నింటికి రప్పించనే పట్టె
తేజము లాపెకెప్పుడు తెలిపేమయ్యా
సాజాన శ్రీ వేంకటేశ సతినిట్టె గూడితివి
యీజాడ నింకనెట్టు యెచ్చరించేమయ్యా

(||pallavi||)
nemu vachchi taḍavāya nī jāgĕṁtainām̐ gaddu
rāma vaddigi nippuḍe rām̐gadavayyā

(||nemu||)
mābudām̐kā nīdonu māḍalāḍane paṭṭĕ
yebŏddu sĕliyavaddi kem̐gedayyā
sūbula nīsiṁgārālu sūḍane yiṁdām̐kām̐baṭṭĕ
ābĕ vūḍigāna nĕppuḍaṁḍanuṁḍemayyā

(||nemu||)
kāsuguṁḍi nī kiṁdām̐kām̐ gānugaliyyane paṭṭĕ
ā sĕlido mārumāḍemanemayyā
seseda nī sem̐talagu sĕlavinavvane paṭṭĕ
sūsi yābĕdo nebŏddu jūjamāḍemayyā

(||nemu||)
rājasabu ninniṁṭigi rappiṁchane paṭṭĕ
tejamu lābĕgĕppuḍu tĕlibemayyā
sājāna śhrī veṁkaḍeśha sadiniṭṭĕ gūḍidivi
yījāḍa niṁkanĕṭṭu yĕchchariṁchemayyā