Nemu seseyamdu maaru neeve segomtivi

నేము సేసేయందు మారు నీవే చేకొంటివి
Language

(॥పల్లవి॥)
నేము సేసేయందు మారు నీవే చేకొంటివి
నేమపు నా పూజలెల్లా నీకు నెక్కెనయ్యా

(॥నేము॥)
పాలజలనిధిలోనఁ బవ్వళించినది యేపో
వాలిన నీకు జలాధివాసము
కోలు ముందై బ్రహ్మయజ్ఞ కుండములాహుతి గొని
వోలినుండే అది నీకు హోమము

(॥నేము॥)
ఆడన ‘నాపోనారామణుఁడ’ వయిన నీకు
ఆదియపో మంత్రకలశాభిషేకము
మొదల నంతర్యామిమూర్తివయిన నీకు
పదవిమీర నదియే ప్రాణప్రతిష్ఠ

(॥నేము॥)
అక్కున శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
వొక్కటై వుండినదే నిత్యోత్సవము
లెక్కలేని వరములు లీలతో మా కిచ్చితివి
యిక్కడ నేపొద్దు మాయింట నుండవయ్య

(||pallavi||)
nemu seseyaṁdu māru nīve segŏṁṭivi
nemabu nā pūjalĕllā nīgu nĕkkĕnayyā

(||nemu||)
pālajalanidhilonam̐ bavvaḽiṁchinadi yebo
vālina nīgu jalādhivāsamu
kolu muṁdai brahmayajña kuṁḍamulāhudi gŏni
volinuṁḍe adi nīgu homamu

(||nemu||)
āḍana ‘nābonārāmaṇum̐ḍa’ vayina nīgu
ādiyabo maṁtragalaśhābhiṣhegamu
mŏdala naṁtaryāmimūrdivayina nīgu
padavimīra nadiye prāṇapradiṣhṭha

(||nemu||)
akkuna śhrīveṁkaḍādri nalamelumaṁgam̐ gūḍi
vŏkkaḍai vuṁḍinade nityotsavamu
lĕkkaleni varamulu līlado mā kichchidivi
yikkaḍa nebŏddu māyiṁṭa nuṁḍavayya