Nemu neevaarame yimdu nerusulevi

నేము నీవారమె యిందు నెరుసులేవి
Language

(॥పల్లవి॥)
నేము నీవారమె యిందు నెరుసులేవి
చేమీఁదయిన మీఁద చెప్పనేల పనులు

(॥నేము॥)
కందువ పనులు సేయఁ గలవు నీవేమైనా
అందాలు సేసుకరాను ఆపె గలదు
పొందులు చూచి మిమ్ము పొగడనేము గలము
మందలించి నగవయ్య మఱి యాల కడమ

(॥నేము॥)
వన్నెలనెవ్వరినైనా వలపించ నీకుఁ జెల్లు
అన్నిటాను దొరతనమాపెకుఁ జెల్లు
కన్నచోటనెల్లా వూడిగానకు నేము గలము
యిన్నిటా మెరయవయ్య యిఁకనేల మరఁగు

(॥నేము॥)
నెలఁతల మర్మములు నీకొక్కనికె పాలు
అలరిన నీరతులు ఆపెపాలు
యెలమి శ్రీ వేంకటేశ యిద్దరిసేవా మాపాలు
నిలువునఁ జొక్కవయ్యా నీకేల వెఱపు

(||pallavi||)
nemu nīvāramĕ yiṁdu nĕrusulevi
semīm̐dayina mīm̐da sĕppanela panulu

(||nemu||)
kaṁduva panulu seyam̐ galavu nīvemainā
aṁdālu sesugarānu ābĕ galadu
pŏṁdulu sūsi mimmu pŏgaḍanemu galamu
maṁdaliṁchi nagavayya maṟi yāla kaḍama

(||nemu||)
vannĕlanĕvvarinainā valabiṁcha nīgum̐ jĕllu
anniḍānu dŏradanamābĕgum̐ jĕllu
kannasoḍanĕllā vūḍigānagu nemu galamu
yinniḍā mĕrayavayya yim̐kanela maram̐gu

(||nemu||)
nĕlam̐tala marmamulu nīgŏkkanigĕ pālu
alarina nīradulu ābĕbālu
yĕlami śhrī veṁkaḍeśha yiddarisevā mābālu
niluvunam̐ jŏkkavayyā nīgela vĕṟabu