నేము నీ కితవైనట్టే నేరుచుకొనేమయ్య
(॥పల్లవి॥)
నేము నీ కితవైనట్టే నేరుచుకొనేమయ్య
మోము చూచి మంచితనములకు లోఁగావు
(॥నేము॥)
వొక్కమాటే యాపెనీతో వుద్దండాలు నేసిసేసి
మొక్కలానఁ దిట్టితేనె మోహింతువు
వెక్కసాన నేమెంత వినుతులు సేసినాను
కక్కసమేగాని మతి గరఁగదు
(॥నేము॥)
వాసిరేఁచుకొని యాపె వచ్చినప్పుడే నిన్ను
చేసోఁక నవ్వితేనే చెలఁగుదువు
సేసవెట్టి నేమెంత సేవలెల్లాఁ జేసినాను
ఆసలు పైపైనేకానీ ఆయములు సోఁకవు
(॥నేము॥)
ఱట్టుగానాపె కాఁగిట నట్టె రసము లొలుక
చుట్టి పట్టి కూడితేనేచొక్కుదువు
యిట్టె శ్రీవేంకటేశ యితవుగా నేఁ గూడితి
గట్టిప్రియములే కాని కాదనఁగఁజాలవు
(||pallavi||)
nemu nī kidavainaṭṭe nerusugŏnemayya
momu sūsi maṁchidanamulagu lom̐gāvu
(||nemu||)
vŏkkamāḍe yābĕnīdo vuddaṁḍālu nesisesi
mŏkkalānam̐ diṭṭidenĕ mohiṁtuvu
vĕkkasāna nemĕṁta vinudulu sesinānu
kakkasamegāni madi garam̐gadu
(||nemu||)
vāsirem̐sugŏni yābĕ vachchinappuḍe ninnu
sesom̐ka navvidene sĕlam̐guduvu
sesavĕṭṭi nemĕṁta sevalĕllām̐ jesinānu
āsalu paibainegānī āyamulu som̐kavu
(||nemu||)
ṟaṭṭugānābĕ kām̐giḍa naṭṭĕ rasamu lŏluga
suṭṭi paṭṭi kūḍidenesŏkkuduvu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yidavugā nem̐ gūḍidi
gaṭṭipriyamule kāni kādanam̐gam̐jālavu