నేము నీ కన్యులమా నీవు మాలో లేవా
(॥పల్లవి॥)
నేము నీ కన్యులమా నీవు మాలో లేవా
యీ మేరలనే మమ్ము యేలుకొందు గాకా
(॥నేము॥)
ధర విభీషణుఁడు మీ తల్లి కడవాఁడా
నిరతి ఘంటాకర్ణుఁడు నీ తండ్రివాఁడా
యిరవై ధృవుఁడు మీ యిల్లాలి కడవాఁడా
శరణన్న మాటలోనే సరుగఁ గాచితివి
(॥నేము॥)
మున్నిటి శబరి నీకు ముమ్మనుమరాలా
మిన్నక వుద్ధవుఁడు మీ మేనమామా
పన్నిన వుడుత నీకు పాయరానిచుట్టమా
యెన్నఁగ వీరల నెల్ల నింతలో మెచ్చితివి
(॥నేము॥)
అహల్య నీ కూతురా అక్రూరుఁడు గొడుకా
విహరించ నీకు శ్రీ వేంకటేశుఁడా
వహి ముత్తాతలా నీచే వరములు గొన్నవారు
మహి నిందులకెపో నీ మఱుఁగు చొచ్చితిని
(||pallavi||)
nemu nī kanyulamā nīvu mālo levā
yī meralane mammu yelugŏṁdu gāgā
(||nemu||)
dhara vibhīṣhaṇum̐ḍu mī talli kaḍavām̐ḍā
niradi ghaṁṭāgarṇum̐ḍu nī taṁḍrivām̐ḍā
yiravai dhṛvum̐ḍu mī yillāli kaḍavām̐ḍā
śharaṇanna māḍalone sarugam̐ gāsidivi
(||nemu||)
munniḍi śhabari nīgu mummanumarālā
minnaga vuddhavum̐ḍu mī menamāmā
pannina vuḍuda nīgu pāyarānisuṭṭamā
yĕnnam̐ga vīrala nĕlla niṁtalo mĕchchidivi
(||nemu||)
ahalya nī kūdurā akrūrum̐ḍu gŏḍugā
vihariṁcha nīgu śhrī veṁkaḍeśhum̐ḍā
vahi muttādalā nīse varamulu gŏnnavāru
mahi niṁdulagĕbo nī maṟum̐gu sŏchchidini