Nemu buddulu seppemaa nelamtagunu

నేము బుద్దులు చెప్పేమా నెలఁతకును
Language

(॥పల్లవి॥)
నేము బుద్దులు చెప్పేమా నెలఁతకును
దీమసము నీవల్లనే తేటతెల్లమాయను

(॥నేము॥)
చెప్పరాని మాట లేమిచెప్పితివో అపెతోడ
ముప్పిరిసిగ్గులతోడ మోము వంచెను
తప్పకుండా నేడ నేడఁ దాఁకించితివో గోరు
రెప్పలెత్తి చూచి మేలు రేచుకొనెను

(॥నేము॥)
నవ్వరాని నవ్వులేమి నవ్వితివో ఆపెతోడ
దువ్వటపుపయ్యద మీఁదు బిగించెను
రవ్వ నెంత వూడిగాలుద రతిఁ జేయించితివో
పువ్వులచెండున నిన్నుఁ బూఁచి వేసెను

(॥నేము॥)
సేయరాని సేఁత యేమి సేసితివో ఆపెను
కాయము బిగించి నిన్నుఁ గాఁగిలించెను
యీయెడ శ్రీవేంకటేశ యెంతగా మన్నించితివో
చాయల సన్నల మొక్కి సంతోసించెను

(||pallavi||)
nemu buddulu sĕppemā nĕlam̐tagunu
dīmasamu nīvallane teḍadĕllamāyanu

(||nemu||)
sĕpparāni māḍa lemisĕppidivo abĕdoḍa
muppirisigguladoḍa momu vaṁchĕnu
tappaguṁḍā neḍa neḍam̐ dām̐kiṁchidivo goru
rĕppalĕtti sūsi melu resugŏnĕnu

(||nemu||)
navvarāni navvulemi navvidivo ābĕdoḍa
duvvaḍabubayyada mīm̐du bigiṁchĕnu
ravva nĕṁta vūḍigāluda radim̐ jeyiṁchidivo
puvvulasĕṁḍuna ninnum̐ būm̐si vesĕnu

(||nemu||)
seyarāni sem̐ta yemi sesidivo ābĕnu
kāyamu bigiṁchi ninnum̐ gām̐giliṁchĕnu
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕṁtagā manniṁchidivo
sāyala sannala mŏkki saṁtosiṁchĕnu