నేమూ నీవలెనే నేరుతుమే ఇన్నిటాను
(॥పల్లవి॥)
నేమూ నీవలెనే నేరుతుమే ఇన్నిటాను
నేమముతో మామీఁద నించవే మన్ననలు
(॥॥)
చెప్పినట్టు సేసేపతి చేతికి లోనై యుండఁగా-
నిప్పుడేకాక పంతము లిఁక నెన్నఁడే
ముప్పిరి నీవేలను ముద్దుటుంగర మదిగో
చిప్పిల నీ కన్నిటాను చెల్లునే నీపగటు
(॥॥)
వలచి యీ విభుఁడు నీవాఁడై నేఁ డుండఁగాను
యెలమి నవ్వునవ్వక యేలమానేవే
పలుసవతులలోన పట్టపుదేవులవట
చలమున నేలవే సవతుల రాజ్యము
(॥॥)
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జెంది కాఁగిలించఁగాను
ఆవేడుక లీ వేడుక లమరుఁగదే
కైవశమై భోగములు కాణాచులాయ నిట్టె
యీవల నన్నేలె నితఁడిది నీమతకము
(||pallavi||)
nemū nīvalĕne nerudume inniḍānu
nemamudo māmīm̐da niṁchave mannanalu
(||||)
sĕppinaṭṭu sesebadi sedigi lonai yuṁḍam̐gā-
nippuḍegāga paṁtamu lim̐ka nĕnnam̐ḍe
muppiri nīvelanu mudduḍuṁgara madigo
sippila nī kanniḍānu sĕllune nībagaḍu
(||||)
valasi yī vibhum̐ḍu nīvām̐ḍai nem̐ ḍuṁḍam̐gānu
yĕlami navvunavvaga yelamāneve
palusavadulalona paṭṭabudevulavaḍa
salamuna nelave savadula rājyamu
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdi kām̐giliṁcham̐gānu
āveḍuga lī veḍuga lamarum̐gade
kaivaśhamai bhogamulu kāṇāsulāya niṭṭĕ
yīvala nannelĕ nidam̐ḍidi nīmadagamu