నెమ్మది నున్నాఁడ విదె నీకేమయ్య మంచి
(॥పల్లవి॥)
నెమ్మది నున్నాఁడ విదె నీకేమయ్య మంచి
నెమ్మిపం డారగించేవు నీకేమయ్యా
(॥నెమ్మ॥)
నీలీల నీళ్లపై తేట నీకేమయ్యాః యీ-
నేలకింద నుండితివి నీకేమయ్యా
యేల నిన్ను మరుతాప మేమిసేసీనిః నీ-
నీలిమేను కందులేదు నీకేమయ్యా
(॥నెమ్మ॥)
నిక్కము బొంకుసేసేవు నీకేమయ్యా యిట్టె
నిక్కిచూచి దాగేవు నీకేమయ్యా
యెక్కడిమోహములు నీకేమియు నేల
నిక్కు సగ్గు లెఱగవు నీకేమయ్యా
(॥నెమ్మ॥)
నిద్దుర గంటఁబెట్టవు నీకేమయ్యాః వట్టి
నిద్దురేల పొయ్యేవు నీకేమయ్యా
గద్దరి శ్రీతిరువేంకటవిభుడః నన్ను
నిద్దపుఁగాఁగిట గూడి నీకేమయ్యా
(||pallavi||)
nĕmmadi nunnām̐ḍa vidĕ nīgemayya maṁchi
nĕmmibaṁ ḍāragiṁchevu nīgemayyā
(||nĕmma||)
nīlīla nīḽlabai teḍa nīgemayyāḥ yī-
nelagiṁda nuṁḍidivi nīgemayyā
yela ninnu marudāba memisesīniḥ nī-
nīlimenu kaṁduledu nīgemayyā
(||nĕmma||)
nikkamu bŏṁkusesevu nīgemayyā yiṭṭĕ
nikkisūsi dāgevu nīgemayyā
yĕkkaḍimohamulu nīgemiyu nela
nikku saggu lĕṟagavu nīgemayyā
(||nĕmma||)
niddura gaṁṭam̐bĕṭṭavu nīgemayyāḥ vaṭṭi
niddurela pŏyyevu nīgemayyā
gaddari śhrīdiruveṁkaḍavibhuḍaḥ nannu
niddabum̐gām̐giḍa gūḍi nīgemayyā