Nemmadi nodaberamu needodi maada

నెమ్మది నోడబేరము నీతోడి మాట
Language

(॥పల్లవి॥)
నెమ్మది నోడబేరము నీతోడి మాట
పమ్మి కాచుకున్నవారి భాగ్యముల కొలఁది

(॥నెమ్మ॥)
కడునిజ మనరాదు కల్లలని ఆడరాదు
నిడుపు గుఱుచలను నీతోడిమాఁట
చిడుముడిఁ గరక సెలవుల నగక నీఁ
బడిబడి నున్న వారి భాగ్యములకొలఁది

(॥నెమ్మ॥)
చేతులఁ బట్టఁగరాడు చెంగట విడువరాదు
నీతితోడి గొల్లమంకు నీతోడిమాట
కాతరానఁ బైకొనక కడకుఁ దొలఁగక నీఁ
పైతరవులున్నవారి భాగ్యములకొలఁది

(॥నెమ్మ॥)
బట్టబయలు గారాదు పయ్యదాఁ గప్పఁగరాదు
నెట్టన సమరతులు నీతోడిమాట
గుట్టుతో శ్రీవేంక టేశ కూడితివి నన్ను నిట్టె
పట్టి పెనఁగేటివారి భాగ్యములకొలఁది

(||pallavi||)
nĕmmadi noḍaberamu nīdoḍi māḍa
pammi kāsugunnavāri bhāgyamula kŏlam̐di

(||nĕmma||)
kaḍunija manarādu kallalani āḍarādu
niḍubu guṟusalanu nīdoḍimām̐ṭa
siḍumuḍim̐ garaga sĕlavula nagaga nīm̐
baḍibaḍi nunna vāri bhāgyamulagŏlam̐di

(||nĕmma||)
sedulam̐ baṭṭam̐garāḍu sĕṁgaḍa viḍuvarādu
nīdidoḍi gŏllamaṁku nīdoḍimāḍa
kādarānam̐ baigŏnaga kaḍagum̐ dŏlam̐gaga nīm̐
paidaravulunnavāri bhāgyamulagŏlam̐di

(||nĕmma||)
baṭṭabayalu gārādu payyadām̐ gappam̐garādu
nĕṭṭana samaradulu nīdoḍimāḍa
guṭṭudo śhrīveṁka ṭeśha kūḍidivi nannu niṭṭĕ
paṭṭi pĕnam̐geḍivāri bhāgyamulagŏlam̐di