Nemmadi ninne golisi nishchimtulame kaaga

నెమ్మది నిన్నే గొలిచి నిశ్చింతులమె కాక
Language

(॥పల్లవి॥)
నెమ్మది నిన్నే గొలిచి నిశ్చింతులమె కాక
దొమ్మిఁ దొంటి చేఁతకంటు దొడ్డాయితి

(॥నెమ్మ॥)
శ్రీపతి నీనామ ముచ్చరించి కృతార్థులై సర్వ
పాపవిముక్తు లైనట్టి ప్రపన్నులకు
యేపునఁ గాల దోషములేవి కర్మదోషమేది
కోపుల లోకముల శకునదోషము లేవి

(॥నెమ్మ॥)
నారాయణ నీదాసులై నరకము లుత్తరించి
వైరములు దాఁటిన శ్రీవైష్ణువులకు
యీరీతి మంత్రలోపము లేవి క్రియాలోపమేది
భారమైన ఆచారలోపము మరేది

(॥నెమ్మ॥)
మించి శ్రీ వేంకటేశ్వర మిమ్ముఁ గొల్చి భవములు
తెంచిన శరణాగత దేహులకు
యెంచి చూడ మాయ లేని యిలఁ గనిబాధ లేని
అంచల నెందుచూచిన అడ్డాఁక లేవి

(||pallavi||)
nĕmmadi ninne gŏlisi niśhchiṁtulamĕ kāga
dŏmmim̐ dŏṁṭi sem̐tagaṁṭu dŏḍḍāyidi

(||nĕmma||)
śhrībadi nīnāma muchchariṁchi kṛtārdhulai sarva
pābavimuktu lainaṭṭi prabannulagu
yebunam̐ gāla doṣhamulevi karmadoṣhamedi
kobula logamula śhagunadoṣhamu levi

(||nĕmma||)
nārāyaṇa nīdāsulai naragamu luttariṁchi
vairamulu dām̐ṭina śhrīvaiṣhṇuvulagu
yīrīdi maṁtralobamu levi kriyālobamedi
bhāramaina āsāralobamu maredi

(||nĕmma||)
miṁchi śhrī veṁkaḍeśhvara mimmum̐ gŏlsi bhavamulu
tĕṁchina śharaṇāgada dehulagu
yĕṁchi sūḍa māya leni yilam̐ ganibādha leni
aṁchala nĕṁdusūsina aḍḍām̐ka levi