నెమ్మది నిచ్చకాలాడ నేఁడు గలిగితివిగాక
(॥పల్లవి॥)
నెమ్మది నిచ్చకాలాడ నేఁడు గలిగితివిగాక
నమ్మిక నా కియ్యఁగా సన్నల మాన్పవలదా
(॥నెమ్మ॥)
పొంతనే యాతనికిఁగా పూనుక వచ్చేవు నీవు
యెంత బత్తిగలదాన వేమిచెప్పేదే
వింతగా నన్నుఁ బెండ్లాడి వెసఁ దెచ్చుకొనె నాఁడు
మంతనాన వద్దనక మరియెందు వోతివే
(॥నెమ్మ॥)
పాడితోడ నాతనిపలుకు చెల్లఁ బెట్టేవు
యేడ నేరుచుకొంటివే నీ వీసుద్దులు
తోడివారిలో నన్ను దొరకత్తెఁ జేసేవేళ
ఆడ వచ్చి బుద్దిచెప్పి అడ్డగించవలదా
(॥నెమ్మ॥)
వొక్కటై శ్రీవేంకటేశునొద్దఁ గాచుకుందానవు
యెక్కడే నీయాసోద మిందరిలోనా
గక్కన నన్నేలినాఁడు కాఁపురము సేయఁగాను
తొక్కవైతివి పాదము తొడిఁబడ నీవు
(||pallavi||)
nĕmmadi nichchagālāḍa nem̐ḍu galigidivigāga
nammiga nā kiyyam̐gā sannala mānpavaladā
(||nĕmma||)
pŏṁtane yādanigim̐gā pūnuga vachchevu nīvu
yĕṁta battigaladāna vemisĕppede
viṁtagā nannum̐ bĕṁḍlāḍi vĕsam̐ dĕchchugŏnĕ nām̐ḍu
maṁtanāna vaddanaga mariyĕṁdu vodive
(||nĕmma||)
pāḍidoḍa nādanibalugu sĕllam̐ bĕṭṭevu
yeḍa nerusugŏṁṭive nī vīsuddulu
toḍivārilo nannu dŏragattĕm̐ jeseveḽa
āḍa vachchi buddisĕppi aḍḍagiṁchavaladā
(||nĕmma||)
vŏkkaḍai śhrīveṁkaḍeśhunŏddam̐ gāsuguṁdānavu
yĕkkaḍe nīyāsoda miṁdarilonā
gakkana nannelinām̐ḍu kām̐puramu seyam̐gānu
tŏkkavaidivi pādamu tŏḍim̐baḍa nīvu