Nemmadi nee vojalu ne neṟamganaa

నెమ్మది నీ వోజలు నే నెఱఁగనా
Language

(॥పల్లవి॥)
నెమ్మది నీ వోజలు నే నెఱఁగనా
అమ్మరో నే నిన్ను సుద్దు లడిగితినా

(॥నెమ్మ॥)
వింటిని మాటలు సారె వేఁడుకొనే వెంత నన్ను
యింటికి విచ్చేతుగాక యీడనేఁటికి
అంటే ననరాదుగాక ఆనలేల పెట్టేవు
నంటున నీవినయాలు నమ్మనంటినా

(॥నెమ్మ॥)
వోడక నాకొంగువట్టి వొడఁబరచే విప్పుడు
యేడలేని రసము లీడనేఁటికి
వీడెమిచ్చేయప్పుడే వేడుకలయ్యీఁగాక
తోడనే కాఁగిలించే విందుల కెగ్గుపట్టేనా

(॥నెమ్మ॥)
గుట్టున నన్నేలితివి కోరి బత్తిగలనని
యిట్టె సాకిరి దెలిపే వీడ నేఁటికి
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
చుట్టరికపుమనసు సోదించవచ్చితినా

(||pallavi||)
nĕmmadi nī vojalu ne nĕṟam̐ganā
ammaro ne ninnu suddu laḍigidinā

(||nĕmma||)
viṁṭini māḍalu sārĕ vem̐ḍugŏne vĕṁta nannu
yiṁṭigi vichchedugāga yīḍanem̐ṭigi
aṁṭe nanarādugāga ānalela pĕṭṭevu
naṁṭuna nīvinayālu nammanaṁṭinā

(||nĕmma||)
voḍaga nāgŏṁguvaṭṭi vŏḍam̐barase vippuḍu
yeḍaleni rasamu līḍanem̐ṭigi
vīḍĕmichcheyappuḍe veḍugalayyīm̐gāga
toḍane kām̐giliṁche viṁdula kĕggubaṭṭenā

(||nĕmma||)
guṭṭuna nannelidivi kori battigalanani
yiṭṭĕ sāgiri dĕlibe vīḍa nem̐ṭigi
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
suṭṭarigabumanasu sodiṁchavachchidinā