నెమ్మది నలుక దీర్చు నీవైనాను । ఆపె
(॥పల్లవి॥)
నెమ్మది నలుక దీర్చు నీవైనాను । ఆపె-
నిమ్మపండు చేత నంటు నీవైనాను
(॥నెమ్మ॥)
యెఱిఁగియు చిత్తములో యేఁటికో చింతించీ నీకె
నెఱవుగా నవ్వవయ్య నీవైనను
తఱి గందమిచ్చితే చేతనే పట్టుకవున్నది
నెఱఁపూత పూయవయ్య నీవైనాను
(॥నెమ్మ॥)
వొయ్యనే తలవుంక వూరకే తా నున్నది
నెయ్యాపూమా టాడవయ్య నీవైనాను
పయ్యదలోఁ దెచ్చినట్టిబాగా లట్టె వున్నవి
నియ్యంత విడెమీవయ్య నీవైనాను
(॥నెమ్మ॥)
యెలమిఁ బానుపుమీఁద ఇంత గుట్టుతో నున్నది
నెలకొని కూడవయ్య నీవైనాను
కలసి శ్రీవేంకటేశ కాచుకున్నది సేసకు
నిలువునఁ బోయవయ్య నీవైనాను
(||pallavi||)
nĕmmadi naluga dīrsu nīvainānu | ābĕ-
nimmabaṁḍu seda naṁṭu nīvainānu
(||nĕmma||)
yĕṟim̐giyu sittamulo yem̐ṭigo siṁtiṁchī nīgĕ
nĕṟavugā navvavayya nīvainanu
taṟi gaṁdamichchide sedane paṭṭugavunnadi
nĕṟam̐pūda pūyavayya nīvainānu
(||nĕmma||)
vŏyyane talavuṁka vūrage tā nunnadi
nĕyyābūmā ṭāḍavayya nīvainānu
payyadalom̐ dĕchchinaṭṭibāgā laṭṭĕ vunnavi
niyyaṁta viḍĕmīvayya nīvainānu
(||nĕmma||)
yĕlamim̐ bānubumīm̐da iṁta guṭṭudo nunnadi
nĕlagŏni kūḍavayya nīvainānu
kalasi śhrīveṁkaḍeśha kāsugunnadi sesagu
niluvunam̐ boyavayya nīvainānu