Nemeyamtaa numdudumu nikkamu nee(ee?) vidyalagu

నేమేయంటా నుండుదుము నిక్కము నీ(ఈ?) విద్యలకు
Language

(॥పల్లవి॥)
నేమేయంటా నుండుదుము నిక్కము నీ(ఈ?) విద్యలకు
కామించి నీవొక్కతెవూఁ గలిగితివే

(॥॥)
చెలరేఁగి చెలరేఁగి చేసేవు విన్నపాలు
చలివాయ నాతఁ డింతచన విచ్చెనా
వలచి కాచుకుండిన వనితలెల్లాఁ జూడఁగా
తలఁచినట్టెల్లా నీ పెద్దరిక మీడేరెనే

(॥॥)
యింటిలో నిడుక పన్నులెన్నియైనాఁ జెప్పేవు
బంటువలె నాతఁడింతపంపు చేసేసునా
దంటలై సవతులెల్లా తమలో నేఁకారఁగాను
పంట వండినట్టు నీభాగ్యము సిద్ధించెనే

(॥॥)
శ్రీ వేంకటేశ్వరునిఁజేరి కాఁగిలించేవు
వావితో నాతఁడు నీకై వసమాయనా
యీవేళ మమ్మేలెఁదానె ఇందరము నున్నారము
చేవదేరి నీమేలు సేసపాలై నిండెనే

(||pallavi||)
nemeyaṁṭā nuṁḍudumu nikkamu nī(ī?) vidyalagu
kāmiṁchi nīvŏkkadĕvūm̐ galigidive

(||||)
sĕlarem̐gi sĕlarem̐gi sesevu vinnabālu
salivāya nādam̐ ḍiṁtasana vichchĕnā
valasi kāsuguṁḍina vanidalĕllām̐ jūḍam̐gā
talam̐sinaṭṭĕllā nī pĕddariga mīḍerĕne

(||||)
yiṁṭilo niḍuga pannulĕnniyainām̐ jĕppevu
baṁṭuvalĕ nādam̐ḍiṁtabaṁpu sesesunā
daṁṭalai savadulĕllā tamalo nem̐kāram̐gānu
paṁṭa vaṁḍinaṭṭu nībhāgyamu siddhiṁchĕne

(||||)
śhrī veṁkaḍeśhvarunim̐jeri kām̐giliṁchevu
vāvido nādam̐ḍu nīgai vasamāyanā
yīveḽa mammelĕm̐dānĕ iṁdaramu nunnāramu
sevaderi nīmelu sesabālai niṁḍĕne