Nemeṟamgamaa nee panulu

నేమెఱఁగమా నీ పనులు
Language

(॥పల్లవి॥)
నేమెఱఁగమా నీ పనులు
నేమము లిటువలె నించెదు గాక

(॥నేమె॥)
చనవరితనమున సతి నినుఁ గదిసిన
ననుపున నొల్లననఁగఁ గలవా
మనసరసేనని మగువలనంపిన
నినుపున యేతులు నెరపెదు గాక

(॥నేమె॥)
చుట్టిరికంబులు సోఁకగఁ బెనకిన
ఱట్టుసేసి మీఱఁగఁ గలవా
కట్టుమట్టుగా కానికలంపిన
గుట్టున నూరకె గునిసెదు గాక

(॥నేమె॥)
మేనరికంబున మేకొని కూడెను
నానినతమి మానఁగఁ గలవా
ఆనుక శ్రీవేంకటాధిప మొక్కిన
నానావిధముల నవ్వెదు గాక

(||pallavi||)
nemĕṟam̐gamā nī panulu
nemamu liḍuvalĕ niṁchĕdu gāga

(||nemĕ||)
sanavaridanamuna sadi ninum̐ gadisina
nanubuna nŏllananam̐gam̐ galavā
manasarasenani maguvalanaṁpina
ninubuna yedulu nĕrabĕdu gāga

(||nemĕ||)
suṭṭirigaṁbulu som̐kagam̐ bĕnagina
ṟaṭṭusesi mīṟam̐gam̐ galavā
kaṭṭumaṭṭugā kānigalaṁpina
guṭṭuna nūragĕ gunisĕdu gāga

(||nemĕ||)
menarigaṁbuna megŏni kūḍĕnu
nāninadami mānam̐gam̐ galavā
ānuga śhrīveṁkaḍādhiba mŏkkina
nānāvidhamula navvĕdu gāga