Nemeṟamgamaa nee nerajaanadanamulu

నేమెఱఁగమా నీ నెరజాణతనములు
Language

(॥పల్లవి॥)
నేమెఱఁగమా నీ నెరజాణతనములు
సాములేల సేసేవు చక్కనుండవయ్యా

(॥నేమె॥)
పగటున నిందరిలోఁ బలుమారు నీవు నవ్వే
నగవులే కావా నమ్మరానివి
మిగులా నిచ్చకముతో మేకొని సరసమాడే
మొగమిచ్చలే కావా మోసపుచ్చేవి

(॥నేమె॥)
సేదదేర నాలిచేసి చెక్కునొక్కి బుజ్జగించే
ఆదరింపులే కావా అలయించేవి
పోదిసేసి వలపుల బొరలించి వేఁడుకొనే
సాదుమాటలే కావా జాలిఁబెట్టేవి

(॥నేమె॥)
మతకాన నీవు నన్ను మన్నించే పానుపుమీది
రతిచెనకులే కావా రాఁపుసేసేవి
యితవై శ్రీవేంకటేశ యింపుతో నీవొసగిన
తతిమోవితేనెలే తమి రేచేవి

(||pallavi||)
nemĕṟam̐gamā nī nĕrajāṇadanamulu
sāmulela sesevu sakkanuṁḍavayyā

(||nemĕ||)
pagaḍuna niṁdarilom̐ balumāru nīvu navve
nagavule kāvā nammarānivi
migulā nichchagamudo megŏni sarasamāḍe
mŏgamichchale kāvā mosabuchchevi

(||nemĕ||)
sedadera nālisesi sĕkkunŏkki bujjagiṁche
ādariṁpule kāvā alayiṁchevi
podisesi valabula bŏraliṁchi vem̐ḍugŏne
sādumāḍale kāvā jālim̐bĕṭṭevi

(||nemĕ||)
madagāna nīvu nannu manniṁche pānubumīdi
radisĕnagule kāvā rām̐pusesevi
yidavai śhrīveṁkaḍeśha yiṁpudo nīvŏsagina
tadimovidenĕle tami resevi