Nememainaa nanemamtaa neegela verabu

నేమేమైనా ననేమంటా నీకేల వెరపు
Language

(॥పల్లవి॥)
నేమేమైనా ననేమంటా నీకేల వెరపు
ఆముక సరసమాడి ఆదరించరాదా

(॥నేమే॥)
చనవు సేసుక నీసంగడిఁ గూచుండినాపె
నెనయక యేల లోని కేఁగుమనేవు
పనిసేయ నోపకున్నాఁ బాదాలొత్త గొరగాదా
అనువుకుఁ దెచ్చుకొని యాదరించరాదా

(॥నేమే॥)
మచ్చిక సేయుచు నాకు మడిచియిచ్చినాపె
పఁచ్చిదేర వేరె యేల పనిచెప్పేవు
యెచ్చుకుందు గలిగినా నిందుకైనా మేలుగాదా
ఇచ్చకము సేసుకొని యీడేర్చరాదా

(॥నేమే॥)
చుట్టరికము నెరపి చొక్కించి కూడె నాపె
గుట్టుమాని చెక్కులేల గోర నూఁదేవు
యెట్టు గబ్బియైనాను యిందుకు లోనుగాదా
గట్టిగా శ్రీవేంకటేశ కరుణించరాదా

(||pallavi||)
nememainā nanemaṁṭā nīgela vĕrabu
āmuga sarasamāḍi ādariṁcharādā

(||neme||)
sanavu sesuga nīsaṁgaḍim̐ gūsuṁḍinābĕ
nĕnayaga yela loni kem̐gumanevu
paniseya nobagunnām̐ bādālŏtta gŏragādā
anuvugum̐ dĕchchugŏni yādariṁcharādā

(||neme||)
machchiga seyusu nāgu maḍisiyichchinābĕ
pam̐schidera verĕ yela panisĕppevu
yĕchchuguṁdu galiginā niṁdugainā melugādā
ichchagamu sesugŏni yīḍersarādā

(||neme||)
suṭṭarigamu nĕrabi sŏkkiṁchi kūḍĕ nābĕ
guṭṭumāni sĕkkulela gora nūm̐devu
yĕṭṭu gabbiyainānu yiṁdugu lonugādā
gaṭṭigā śhrīveṁkaḍeśha karuṇiṁcharādā