Nemellaa neeyamta neramaa yemi

నేమెల్లా నీయంత నేరమా యేమి
Language

(॥పల్లవి॥)
నేమెల్లా నీయంత నేరమా యేమి
గామిడితనాలు బుద్దికాదని కాక

(॥నేమె॥)
యిచ్చకపుమాఁటలు యెందాఁకా నాడేవే
పచ్చిగా విభునినేల భ్రమయించేవే
నెచ్చెలులు నీవలె నేరనివారా యేమి
తుచ్చెము సేయుట కడుదోసమనికాక

(॥నేమె॥)
చనవున నేంతని సాదించేవే యతని
యెనసి పను లెట్టు చేయించుకొనేవే
వనితలిందరు నీవంటివారే కారా యేమి
కొనల కెక్కేది కడు గోరతనికాక

(॥నేమె॥)
భావించి యెటువలె బాసలుగొనేవే నీవు
శ్రీవేంకటేశ్వరు నెట్టు చిక్కించితివే
నీవలెనే కూడమా నిండుఁగాఁగిట నితని
చేవదేరే దిది కడుసిబ్బితనికాక

(||pallavi||)
nemĕllā nīyaṁta neramā yemi
gāmiḍidanālu buddigādani kāga

(||nemĕ||)
yichchagabumām̐ṭalu yĕṁdām̐kā nāḍeve
pachchigā vibhuninela bhramayiṁcheve
nĕchchĕlulu nīvalĕ neranivārā yemi
tuchchĕmu seyuḍa kaḍudosamanigāga

(||nemĕ||)
sanavuna neṁtani sādiṁcheve yadani
yĕnasi panu lĕṭṭu seyiṁchugŏneve
vanidaliṁdaru nīvaṁṭivāre kārā yemi
kŏnala kĕkkedi kaḍu goradanigāga

(||nemĕ||)
bhāviṁchi yĕḍuvalĕ bāsalugŏneve nīvu
śhrīveṁkaḍeśhvaru nĕṭṭu sikkiṁchidive
nīvalĕne kūḍamā niṁḍum̐gām̐giḍa nidani
sevadere didi kaḍusibbidanigāga