Neme brahmamanugo neramu nemu

నేమే బ్రహ్మమనుకో నేరము నేము
Language

(॥పల్లవి॥)
నేమే బ్రహ్మమనుకో నేరము నేము-
కామించిన స్వతంత్రము గడు లేదుగాన

(॥నేమే॥)
క్షణములోపలనె సర్వజీవావస్థలూను
గణుతించేవాఁ డొకఁడు గలఁడు వేరే
అణుమహత్త్వములందు నంతర్యామైనవాని
ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని

(॥నేమే॥)
పనిగొని యేలుటకు బ్రహ్మాది దేవతలఁ
గనిపించేవాఁ డొకఁడు గలఁడు వేరే
ననిచి సిరుల లక్ష్మీనాథుఁడైనవాని-
పనులవారము నేము బ్రదికేముగాని

(॥నేమే॥)
సతతరక్షకుఁడయి శంఖచక్రధరుఁడయి
గతి శ్రీవేంకటపతి గలఁడు వేరే
అతనిమఱఁగు చొచ్చి యానందపరవశానఁ
బ్రతిలేక యిందరిలో బ్రదికేము గాని

(||pallavi||)
neme brahmamanugo neramu nemu-
kāmiṁchina svadaṁtramu gaḍu ledugāna

(||neme||)
kṣhaṇamulobalanĕ sarvajīvāvasthalūnu
gaṇudiṁchevām̐ ḍŏgam̐ḍu galam̐ḍu vere
aṇumahattvamulaṁdu naṁtaryāmainavāni
praṇudiṁchi dāsulamai bradigemugāni

(||neme||)
panigŏni yeluḍagu brahmādi devadalam̐
ganibiṁchevām̐ ḍŏgam̐ḍu galam̐ḍu vere
nanisi sirula lakṣhmīnāthum̐ḍainavāni-
panulavāramu nemu bradigemugāni

(||neme||)
sadatarakṣhagum̐ḍayi śhaṁkhasakradharum̐ḍayi
gadi śhrīveṁkaḍabadi galam̐ḍu vere
adanimaṟam̐gu sŏchchi yānaṁdabaravaśhānam̐
bradilega yiṁdarilo bradigemu gāni