నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి
(॥పల్లవి॥)
నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి
పోఁడిమి నాచార్యుని బోధ వంకను
(॥నేఁడు॥)
దీనవృత్తి నేఁ దిరుగని చోటేది
నానాచంచలము నామనసు
పూని నేఁగొనని భువిలోని రుచు లేవి
హీనజన్మము లెత్తిన దీమేను
(॥నేఁడు॥)
చేరి నేఁజేచేతఁ జేయనిపాప మేది
ధారుణి మోపైన సంసారమునను
ఆరయ మున్ను నేనాడని కల్లలేవి
సారెకు నుదురుపోషణమునకు
(॥నేఁడు॥)
సూటిదప్పక నేఁ జూడని చూపేది
చేటులేని చిరకాల జీవుఁడనే
చాటువ శ్రీవేంకటేశు శరణు చొరకతొల్లి
బూటకము లెన్ని లేవు పొలయదు కాలము
(||pallavi||)
nem̐ḍugāga dŏranaidi nenu nārāyaṇum̐ gŏlsi
pom̐ḍimi nāsāryuni bodha vaṁkanu
(||nem̐ḍu||)
dīnavṛtti nem̐ dirugani soḍedi
nānāsaṁchalamu nāmanasu
pūni nem̐gŏnani bhuviloni rusu levi
hīnajanmamu lĕttina dīmenu
(||nem̐ḍu||)
seri nem̐jesedam̐ jeyanibāba medi
dhāruṇi mobaina saṁsāramunanu
āraya munnu nenāḍani kallalevi
sārĕgu nuduruboṣhaṇamunagu
(||nem̐ḍu||)
sūḍidappaga nem̐ jūḍani sūbedi
seḍuleni siragāla jīvum̐ḍane
sāḍuva śhrīveṁkaḍeśhu śharaṇu sŏragadŏlli
būḍagamu lĕnni levu pŏlayadu kālamu