నేఁడుగా నా నుడిమాట నీవల్ల నిజమాయ
(॥పల్లవి॥)
నేఁడుగా నా నుడిమాట నీవల్ల నిజమాయ
వేఁడి యంటేఁ జల్ల నీవు వెస నూదుకోరురా
(॥నేఁడు॥)
వన్నెల నే వాడలోనివనితల నాడుకొంటే
నిన్ను సోఁకి రాదు గదా నీ వేల నవ్వేవు
అన్నిటా గుమ్మడికాయ లన్న సుద్ది దడవితే
పన్ని నేఁడు నీ బుజాలు పట్టి చూచుకోకురా
(॥నేఁడు॥)
మోము లొకరొకర మిమ్ముల నేము చూచుకొంటే
నీ మైఁ దప్పులేదు గదా నీ వేల నవ్వేవు
వోముచు నే నుప్పంటే వుపతాపానఁ బడేవు
యేమిరా నీకు నీకే యింత వెఱపేలరా
(॥నేఁడు॥)
ఆవల నలసినవా రట్టె విసరించుకొంటే
నీ వలసిరావు గదా నీ వేల నవ్వేవు
భావించి శ్రీవేంకటేశ పట్టి నన్నుఁ గూడితివి
చేవలు దేరిన మీఁద చిగురు గా నేలరా
(||pallavi||)
nem̐ḍugā nā nuḍimāḍa nīvalla nijamāya
vem̐ḍi yaṁṭem̐ jalla nīvu vĕsa nūdugorurā
(||nem̐ḍu||)
vannĕla ne vāḍalonivanidala nāḍugŏṁṭe
ninnu som̐ki rādu gadā nī vela navvevu
anniḍā gummaḍigāya lanna suddi daḍavide
panni nem̐ḍu nī bujālu paṭṭi sūsugogurā
(||nem̐ḍu||)
momu lŏgarŏgara mimmula nemu sūsugŏṁṭe
nī maim̐ dappuledu gadā nī vela navvevu
vomusu ne nuppaṁṭe vubadābānam̐ baḍevu
yemirā nīgu nīge yiṁta vĕṟabelarā
(||nem̐ḍu||)
āvala nalasinavā raṭṭĕ visariṁchugŏṁṭe
nī valasirāvu gadā nī vela navvevu
bhāviṁchi śhrīveṁkaḍeśha paṭṭi nannum̐ gūḍidivi
sevalu derina mīm̐da siguru gā nelarā