నేఁడు చెలుల చేతిదే నేరుపెల్లాను
(॥పల్లవి॥)
నేఁడు చెలుల చేతిదే నేరుపెల్లాను
పోఁడిమికి నెక్కినవే భోగపు మీ చేఁతలు
(॥నేఁడు॥)
పేరుకొని నీ వాపెఁ బిలువ సిగ్గువడేవు
వూరకే తనంత నీవొద్దికి రాదు
ఆరీతి మీలోనిఆసలైతే గంపెఁడేసి
పేరడాయ మీరుమీరే పెట్టుకొన్నవొట్లు
(॥నేఁడు॥)
మట్టు మీరి నీకు నీవే మాటలాడఁ గొంకేవు
అట్టె ఆపెయు నిన్ను నదేమనదు
వొట్టుకొన్న వలపులు వొడినే వున్నవి మీకు
కట్టుకొన్న తాళాయ కడుమీపంతములు
(॥నేఁడు॥)
తలయెత్తి లోఁగేవు తఱ వాతిపనులకు
తెలిసియుఁ జెనకదు తెక్కువ నాపె
కలయించె మిమ్మును యేకతమె శ్రీవెంకటేశ
తలఁపులే తగులాయ తనుఁదానె మీకు
(||pallavi||)
nem̐ḍu sĕlula sedide nerubĕllānu
pom̐ḍimigi nĕkkinave bhogabu mī sem̐talu
(||nem̐ḍu||)
perugŏni nī vābĕm̐ biluva sigguvaḍevu
vūrage tanaṁta nīvŏddigi rādu
ārīdi mīloniāsalaide gaṁpĕm̐ḍesi
peraḍāya mīrumīre pĕṭṭugŏnnavŏṭlu
(||nem̐ḍu||)
maṭṭu mīri nīgu nīve māḍalāḍam̐ gŏṁkevu
aṭṭĕ ābĕyu ninnu nademanadu
vŏṭṭugŏnna valabulu vŏḍine vunnavi mīgu
kaṭṭugŏnna tāḽāya kaḍumībaṁtamulu
(||nem̐ḍu||)
talayĕtti lom̐gevu taṟa vādibanulagu
tĕlisiyum̐ jĕnagadu tĕkkuva nābĕ
kalayiṁchĕ mimmunu yegadamĕ śhrīvĕṁkaḍeśha
talam̐pule tagulāya tanum̐dānĕ mīgu