నేఁడు గొత్తలా తనకు నెయ్యపుజాణతనాలు
(॥పల్లవి॥)
నేఁడు గొత్తలా తనకు నెయ్యపుజాణతనాలు
నాఁడే కానవచ్చెను ననుపులెల్లాను
(॥॥)
చెంత నుండి పలికీని చేయి మీఁద వేసీని
యెంత లేదు తనవలపెరుఁగు నటే
వంతు తోఁ బువులెల్లాను వాసనలు చూపీని
ఇంతటితనతమక మేమి చెప్పేనే
(॥॥)
సెలవుల నవ్వీని చెక్కులు గడు నొక్కీని
తెలిసితిఁగదే తన తెఱఁగెల్లాను
బలిమి నూరకే తాను పచ్చడము గప్పీని
కలిగెనె తన పొందు కాణాచి నాకు
(॥॥)
కన్నులఁ దప్పక చూచీ కాఁగిలించి కూడీని
నన్ను శ్రీవేంకటేశుఁడు మన్నించెఁ దానె
సన్నల నప్పుడే నాతో సరసము లాడీని
పన్నిన వేడుకతో నా భాగ్యమాయనే
(||pallavi||)
nem̐ḍu gŏttalā tanagu nĕyyabujāṇadanālu
nām̐ḍe kānavachchĕnu nanubulĕllānu
(||||)
sĕṁta nuṁḍi paligīni seyi mīm̐da vesīni
yĕṁta ledu tanavalabĕrum̐gu naḍe
vaṁtu tom̐ buvulĕllānu vāsanalu sūbīni
iṁtaḍidanadamaga memi sĕppene
(||||)
sĕlavula navvīni sĕkkulu gaḍu nŏkkīni
tĕlisidim̐gade tana tĕṟam̐gĕllānu
balimi nūrage tānu pachchaḍamu gappīni
kaligĕnĕ tana pŏṁdu kāṇāsi nāgu
(||||)
kannulam̐ dappaga sūsī kām̐giliṁchi kūḍīni
nannu śhrīveṁkaḍeśhum̐ḍu manniṁchĕm̐ dānĕ
sannala nappuḍe nādo sarasamu lāḍīni
pannina veḍugado nā bhāgyamāyane