Nemde yimta seyagumte nimda vaayadu

నేఁడే యింత సేయకుంటే నింద వాయదు
Language

(॥పల్లవి॥)
నేఁడే యింత సేయకుంటే నింద వాయదు
పోఁడిమితో విన్నవారు పొంచి నవ్వే రిందుకు

(॥నేఁడే॥)
జాడతో నీతమ్ములము సతి యడుగఁగ వచ్చి
యేడదోయనుచు సందేహించుకొనెను
తోడనే నమ్మికగాను తోడుకవచ్చి యాకెతో
వోడక యానలువెట్టి వొడఁబరచవయ్యా

(॥నేఁడే॥)
తెఱలి నీమోవితేనెతీపు చవిగొని ఇంతి
మఱెవ్వతెంగిలో యని మది నెంచెను
తఱితోడ నాపెలోనితడఁబాటులెల్లాఁ దీర
గుఱియైనబాస చేసి కొంకు దేర్చవయ్యా

(॥నేఁడే॥)
అంది నీవురము గంద మలమేల్మంగ యలఁది
యెందుఁ దెచ్చిశివోయంటా యీసడించీని
ఇందునే శ్రీవేంకటేశ యెరపరికము వాయ
కందువఁ దారుకాణించి కాఁగిలించవయ్యా

(||pallavi||)
nem̐ḍe yiṁta seyaguṁṭe niṁda vāyadu
pom̐ḍimido vinnavāru pŏṁchi navve riṁdugu

(||nem̐ḍe||)
jāḍado nīdammulamu sadi yaḍugam̐ga vachchi
yeḍadoyanusu saṁdehiṁchugŏnĕnu
toḍane nammigagānu toḍugavachchi yāgĕdo
voḍaga yānaluvĕṭṭi vŏḍam̐barasavayyā

(||nem̐ḍe||)
tĕṟali nīmovidenĕdību savigŏni iṁti
maṟĕvvadĕṁgilo yani madi nĕṁchĕnu
taṟidoḍa nābĕlonidaḍam̐bāḍulĕllām̐ dīra
guṟiyainabāsa sesi kŏṁku dersavayyā

(||nem̐ḍe||)
aṁdi nīvuramu gaṁda malamelmaṁga yalam̐di
yĕṁdum̐ dĕchchiśhivoyaṁṭā yīsaḍiṁchīni
iṁdune śhrīveṁkaḍeśha yĕrabarigamu vāya
kaṁduvam̐ dārugāṇiṁchi kām̐giliṁchavayyā