నేఁడే పెండ్లివేళ నేఁడే నాగవల్లి
(॥పల్లవి॥)
నేఁడే పెండ్లివేళ నేఁడే నాగవల్లి
ఆడుచు సోబానఁ బాడుమనరే చెలులూ
(॥నేఁడే॥)
కకాంబరుఁ డతఁడు కనకకుచగిరి యీకె
కొనబుగల యిద్దరికిఁ గూడెఁ బొంతనము
వనజనాభఁ డతఁడు వనజలోచన యీకె
ఘనమైన కంకణము గట్టరే చెలులు
(॥నేఁడే॥)
నీలవరుఁ డతఁడు నీలకుంతలి యీకె
చాలుకొని యిద్దరికి జంట దగును
ఆలరైన శంఖధరుఁ డతఁ డీకె కంబుకంఠి
యీ లీల నారతులు యెత్తరే చెలులు
(॥నేఁడే॥)
జలధిశాయిని యతఁడు జలధికన్నెక యీకె
కలిగె నిద్దరికి నొక్క కైవాడము
అలరు శ్రీవేంకటేశుఁ డతఁ డీకె మహలక్ష్మి
వెలయఁగల సిరి దీవించరే చెలులు
(||pallavi||)
nem̐ḍe pĕṁḍliveḽa nem̐ḍe nāgavalli
āḍusu sobānam̐ bāḍumanare sĕlulū
(||nem̐ḍe||)
kagāṁbarum̐ ḍadam̐ḍu kanagagusagiri yīgĕ
kŏnabugala yiddarigim̐ gūḍĕm̐ bŏṁtanamu
vanajanābham̐ ḍadam̐ḍu vanajalosana yīgĕ
ghanamaina kaṁkaṇamu gaṭṭare sĕlulu
(||nem̐ḍe||)
nīlavarum̐ ḍadam̐ḍu nīlaguṁtali yīgĕ
sālugŏni yiddarigi jaṁṭa dagunu
ālaraina śhaṁkhadharum̐ ḍadam̐ ḍīgĕ kaṁbugaṁṭhi
yī līla nāradulu yĕttare sĕlulu
(||nem̐ḍe||)
jaladhiśhāyini yadam̐ḍu jaladhigannĕga yīgĕ
kaligĕ niddarigi nŏkka kaivāḍamu
alaru śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ ḍīgĕ mahalakṣhmi
vĕlayam̐gala siri dīviṁchare sĕlulu