Nemde naagavelli nemde yillunimpulu

నేఁడే నాగవెల్లి నేఁడే యిల్లునింపులు
Language

(॥పల్లవి॥)
నేఁడే నాగవెల్లి నేఁడే యిల్లునింపులు
పోఁడిమి గోవిందపతి భోగించీ నిదివో

(॥నేఁడే॥)
అల్లదే దేవునిరథ మల్లదే గరుడధ్వజఁ
మెల్లలోకములు గెల్చి యేఁగీనదే
యిల్లిదే లక్ష్మి భూము లిద్దరుదేవుళ్లు వీరె
చల్లేరు శాసలుఁదాము సరికి బేసికిని

(॥నేఁడే॥)
సేనాపతి యల్లవాఁడే చేరి దేవతలు వారే
శ్రీనారాయణుఁడు చెలఁగీనదే
ఆనుక యడుగడుగు కారగీంచీ వీధులను
వానలుగా నందరికి వరములొసఁగుచు

(॥నేఁడే॥)
దేవదుందుభలు మ్రోసె దిక్కులెల్లాఁ జల్లనాయ
శ్రీ వేంకటేశుఁ డితఁడె చిత్తగించీని
సేవించరో భావించరో జీవులాల బ్రదుకుఁడు
వేవేలు శోభనముల వేడుకకాఁ డితఁడు

(||pallavi||)
nem̐ḍe nāgavĕlli nem̐ḍe yilluniṁpulu
pom̐ḍimi goviṁdabadi bhogiṁchī nidivo

(||nem̐ḍe||)
allade devuniratha mallade garuḍadhvajam̐
mĕllalogamulu gĕlsi yem̐gīnade
yillide lakṣhmi bhūmu liddarudevuḽlu vīrĕ
salleru śhāsalum̐dāmu sarigi besigini

(||nem̐ḍe||)
senābadi yallavām̐ḍe seri devadalu vāre
śhrīnārāyaṇum̐ḍu sĕlam̐gīnade
ānuga yaḍugaḍugu kāragīṁchī vīdhulanu
vānalugā naṁdarigi varamulŏsam̐gusu

(||nem̐ḍe||)
devaduṁdubhalu mrosĕ dikkulĕllām̐ jallanāya
śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ sittagiṁchīni
seviṁcharo bhāviṁcharo jīvulāla bradugum̐ḍu
vevelu śhobhanamula veḍugagām̐ ḍidam̐ḍu