నేఁడే హరిసేవ లయితే నిత్యభోగములు
(॥పల్లవి॥)
నేఁడే హరిసేవ లయితే నిత్యభోగములు
పోఁడిమి దెలుసుకోవో బుద్ధెఱిఁగి జీవుఁడా
(॥నేఁడే॥)
పక్కన మనసులోన పాలు దాగినటనే
చక్కని మాయలలో సంసారభోగములు
నిక్కి నిక్కి నీళ్లలో నీడ చూచనట్లానే
దిక్కుల కర్మఫలము దిచ్చభోగములు
(॥నేఁడే॥)
కన్నులు మూసి మదిలోఁ గలలు గని నట్లానే
పన్ని లోకముల ప్రపంచభోగములు
అన్నిటాఁ దెరలో బొమ్మలాట లాడినట్లానే
నన్నల బుట్ట పెరిగే జన్మభోగములు
(॥నేఁడే॥)
కడుఁ జందమామ గుటుకలు మింగినట్లానే
తడవి మోహించు చిత్తజభోగములు
యెడయక శ్రీవేంకటేశుఁడు గరుణించితే
అడియాలపు టీవులు ఆత్మభోగములు
(||pallavi||)
nem̐ḍe hariseva layide nityabhogamulu
pom̐ḍimi dĕlusugovo buddhĕṟim̐gi jīvum̐ḍā
(||nem̐ḍe||)
pakkana manasulona pālu dāginaḍane
sakkani māyalalo saṁsārabhogamulu
nikki nikki nīḽlalo nīḍa sūsanaṭlāne
dikkula karmaphalamu dichchabhogamulu
(||nem̐ḍe||)
kannulu mūsi madilom̐ galalu gani naṭlāne
panni logamula prabaṁchabhogamulu
anniḍām̐ dĕralo bŏmmalāḍa lāḍinaṭlāne
nannala buṭṭa pĕrige janmabhogamulu
(||nem̐ḍe||)
kaḍum̐ jaṁdamāma guḍugalu miṁginaṭlāne
taḍavi mohiṁchu sittajabhogamulu
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍu garuṇiṁchide
aḍiyālabu ṭīvulu ātmabhogamulu