Nemdannidaa jaanamdavai neevu nannum galasevu

నేఁడన్నిటా జాణఁడవై నీవు నన్నుఁ గలసేవు
Language

(॥పల్లవి॥)
నేఁడన్నిటా జాణఁడవై నీవు నన్నుఁ గలసేవు
వేఁడుకొనేము పదారువేలకు మగఁడవా

(॥॥)
చెక్కులు నొక్కితే నీ సెలవులఁ బాలు చిందీ
చక్కని రేపల్లె పాలచాడే(?) దొంగవా
మొక్కి ముద్దిడుకొంటే మోవి నావులు వచ్చీని
గుక్కక నీవు దొల్లి గొల్ల మందవాఁడవా

(॥॥)
వెసమాట లాడించితే వెన్నముద్దలే రాలీని
పొసఁగ గోపికలతో పొందువాఁడవా
పిసికితే నవ్వులఁ బేరి పెరుగులై
దొసఁగుల కపటపు దొడ్డివాఁడవా

(॥॥)
కలిసితే మంచి తావి కౌఁగిటను జిడ్డు దేరీ
పెలుచు పనులఁ గాచే పెండ్లి కొడుక
అలమేలుమంగ పతివై శ్రీ వేంకటాద్రి
నిలిచితి వేలఁగొండ నీ వెత్తిన వాఁడవా

(||pallavi||)
nem̐ḍanniḍā jāṇam̐ḍavai nīvu nannum̐ galasevu
vem̐ḍugŏnemu padāruvelagu magam̐ḍavā

(||||)
sĕkkulu nŏkkide nī sĕlavulam̐ bālu siṁdī
sakkani reballĕ pālasāḍe(?) dŏṁgavā
mŏkki muddiḍugŏṁṭe movi nāvulu vachchīni
gukkaga nīvu dŏlli gŏlla maṁdavām̐ḍavā

(||||)
vĕsamāḍa lāḍiṁchide vĕnnamuddale rālīni
pŏsam̐ga gobigalado pŏṁduvām̐ḍavā
pisigide navvulam̐ beri pĕrugulai
dŏsam̐gula kabaḍabu dŏḍḍivām̐ḍavā

(||||)
kaliside maṁchi tāvi kaum̐giḍanu jiḍḍu derī
pĕlusu panulam̐ gāse pĕṁḍli kŏḍuga
alamelumaṁga padivai śhrī veṁkaḍādri
nilisidi velam̐gŏṁḍa nī vĕttina vām̐ḍavā