నేఁడాతని సంపదెల్ల నీభాగ్యము
(॥పల్లవి॥)
నేఁడాతని సంపదెల్ల నీభాగ్యము
పోఁడిమితో వలపులు పోగులు వోసీని
(॥నేఁడా॥)
చలపాదినతమేల సకియతో నవ్వఁగదే
చెలువుఁడు మాటలనే సిగ్గురేఁచీని
పళువులఁజూపుల నీవు చక్కఁజూడఁగదవే
కలసొమ్ములెల్లాను సింగారించుకొనీని
(॥నేఁడా॥)
మంకుఁదన మింతయేల మాటలైనా నాడఁగదే
అంకెల నిన్నాతఁడిట్టె ఆదరించీని
బింకపుబీరాలు మాని పెదవి లంచమియ్యనే
కంకణము నీ కతఁడు గట్టఁజూచీని
(॥నేఁడా॥)
పంతము లప్పటినేల పానుపుపైఁ గూచుండవే
చెంత శ్రీవేంకటేశుఁడు చేయివట్టీని
ఇంతటలమేల్మంగ విన్నిటా మెచ్చవే
మంతనపురతులను మక్కళించీని
(||pallavi||)
nem̐ḍādani saṁpadĕlla nībhāgyamu
pom̐ḍimido valabulu pogulu vosīni
(||nem̐ḍā||)
salabādinadamela sagiyado navvam̐gade
sĕluvum̐ḍu māḍalane siggurem̐sīni
paḽuvulam̐jūbula nīvu sakkam̐jūḍam̐gadave
kalasŏmmulĕllānu siṁgāriṁchugŏnīni
(||nem̐ḍā||)
maṁkum̐dana miṁtayela māḍalainā nāḍam̐gade
aṁkĕla ninnādam̐ḍiṭṭĕ ādariṁchīni
biṁkabubīrālu māni pĕdavi laṁchamiyyane
kaṁkaṇamu nī kadam̐ḍu gaṭṭam̐jūsīni
(||nem̐ḍā||)
paṁtamu lappaḍinela pānububaim̐ gūsuṁḍave
sĕṁta śhrīveṁkaḍeśhum̐ḍu seyivaṭṭīni
iṁtaḍalamelmaṁga vinniḍā mĕchchave
maṁtanaburadulanu makkaḽiṁchīni