నేఁ గాఁగానే కాక నీకు వేరొకతైతే
(॥పల్లవి॥)
నేఁ గాఁగానే కాక నీకు వేరొకతైతే
పోఁగు వోఁగుఁ బొందకుండాఁ బొగడించదా
(॥నేఁగా॥)
నవ్వుతా నీ వన్నవట నమ్మితిఁ గనక నేను
నెవ్వగ నీ విరహన నీరుగా నయితి
అవ్వల వేరొక్క తైతే నాఁపలేక నీ యెదుట
జవ్వనపు గోలతో దోసము గట్టదా
(॥నేఁగా॥)
అప్పుడు నిక్కి చూచిన ఆస గలదు గనక
కప్పి మరుబాణముల గాలిఁ బోనైతి
నెప్పున నేరొక తైతే నీవు సేసే చేఁతులకు
చెప్ప నేల పేరుఁ గీర్తిఁ జేయ నోపదా
(॥నేఁగా॥)
చనవై నీ మోవితేనె చవి యిట్టే కొంటిఁ గాన
తనిసి తొల్లిటి వెల్లాఁ దల చ నైతి
వనిత వేరొక తైతే వాసికే శ్రీవేంకటేశ
తనువు నీపై వేసి తమకించదా
(||pallavi||)
nem̐ gām̐gāne kāga nīgu verŏgadaide
pom̐gu vom̐gum̐ bŏṁdaguṁḍām̐ bŏgaḍiṁchadā
(||nem̐gā||)
navvudā nī vannavaḍa nammidim̐ ganaga nenu
nĕvvaga nī virahana nīrugā nayidi
avvala verŏkka taide nām̐palega nī yĕduḍa
javvanabu golado dosamu gaṭṭadā
(||nem̐gā||)
appuḍu nikki sūsina āsa galadu ganaga
kappi marubāṇamula gālim̐ bonaidi
nĕppuna nerŏga taide nīvu sese sem̐tulagu
sĕppa nela perum̐ gīrdim̐ jeya nobadā
(||nem̐gā||)
sanavai nī movidenĕ savi yiṭṭe kŏṁṭim̐ gāna
tanisi tŏlliḍi vĕllām̐ dala sa naidi
vanida verŏga taide vāsige śhrīveṁkaḍeśha
tanuvu nībai vesi tamagiṁchadā