నేఁ డింత ఱాఁగతనము నేరిచినదానవు
(॥పల్లవి॥)
నేఁ డింత ఱాఁగతనము నేరిచినదానవు
నాఁడె యెచ్చరికెతోడ నడపఁగ వలదా
(॥నేఁడింతు॥)
యెందు వోతి వని పతి నిట్టే సాదించేదానవు
ముందేయాతనిపాయము ముద్రించరాదా
సందడి నాతనిపై మచ్చము సోదించే దానవు
తందుడు కేల వజ్రాంగి దొడుగఁగవలదా
(॥నేఁడింత॥)
గట్టిగాఁ జెలుల నట్టికము వెట్టేదానవు
దిట్టివై నీవే వెంటఁ దిరుగరాదా
బట్టిబయలు చేఁతలు బావించేదానవు
పెట్టెలో నాతని మతి కట్టి పెట్టవలదా
(॥నేఁడింత॥)
పొలసి యాతని మోవిఁ జొప్పు లెత్తేదానవు
వెలయ నీ శాసనము వెయ్యఁగరాదా
యెలమి శ్రీవేంకటేశఁ డిట్టే నిన్ను నన్నుఁ గూడె
కలిగినరతు లెల్లా గాదెఁ బోయ వలదా
(||pallavi||)
nem̐ ḍiṁta ṟām̐gadanamu nerisinadānavu
nām̐ḍĕ yĕchcharigĕdoḍa naḍabam̐ga valadā
(||nem̐ḍiṁtu||)
yĕṁdu vodi vani padi niṭṭe sādiṁchedānavu
muṁdeyādanibāyamu mudriṁcharādā
saṁdaḍi nādanibai machchamu sodiṁche dānavu
taṁduḍu kela vajrāṁgi dŏḍugam̐gavaladā
(||nem̐ḍiṁta||)
gaṭṭigām̐ jĕlula naṭṭigamu vĕṭṭedānavu
diṭṭivai nīve vĕṁṭam̐ dirugarādā
baṭṭibayalu sem̐talu bāviṁchedānavu
pĕṭṭĕlo nādani madi kaṭṭi pĕṭṭavaladā
(||nem̐ḍiṁta||)
pŏlasi yādani movim̐ jŏppu lĕttedānavu
vĕlaya nī śhāsanamu vĕyyam̐garādā
yĕlami śhrīveṁkaḍeśham̐ ḍiṭṭe ninnu nannum̐ gūḍĕ
kaliginaradu lĕllā gādĕm̐ boya valadā