Nelamtaro ramanuni neramemchanemtige

నెలఁతరో రమణుని నేరమెంచనేఁటికే
Language

(॥పల్లవి॥)
నెలఁతరో రమణుని నేరమెంచనేఁటికే
చలము సాదించవచ్చే సతులకుఁ గాక

(॥నెలఁ॥)
మగనాలేటికే మంకుఁదనాలవొట్లు
తెగనాడే వీరిడికత్తెలకుఁగాక
మొగమోటదానికేలే మొనగోరితాఁలు
అగడైనరతుల గయ్యళిదానిఁగాక

(॥నెలఁ॥)
గుట్టుతోడిదానేలే గొరబు బొమ్మజంకెలు
రట్టడితనముల కరాళికిఁగాక
చుట్టపుదానికేలే సూడుఁబాడు సొలపులు
దిట్టతనమున నవ్వేతెక్కలికిఁ గాక

(॥నెలఁ॥)
పెండ్లికూతురుకేలే పెనఁగొన్న పంతములు
దండితనాలను మేనదానికిఁగాక
అండనే శ్రీవేంకటేశుఁడాతఁడే నిన్నుఁ గూడె
బెండుసేయ నీకేలే పెరవారికిఁ గాక

(||pallavi||)
nĕlam̐taro ramaṇuni neramĕṁchanem̐ṭige
salamu sādiṁchavachche sadulagum̐ gāga

(||nĕlam̐||)
maganāleḍige maṁkum̐danālavŏṭlu
tĕganāḍe vīriḍigattĕlagum̐gāga
mŏgamoḍadānigele mŏnagoridām̐lu
agaḍainaradula gayyaḽidānim̐gāga

(||nĕlam̐||)
guṭṭudoḍidānele gŏrabu bŏmmajaṁkĕlu
raṭṭaḍidanamula karāḽigim̐gāga
suṭṭabudānigele sūḍum̐bāḍu sŏlabulu
diṭṭadanamuna navvedĕkkaligim̐ gāga

(||nĕlam̐||)
pĕṁḍligūdurugele pĕnam̐gŏnna paṁtamulu
daṁḍidanālanu menadānigim̐gāga
aṁḍane śhrīveṁkaḍeśhum̐ḍādam̐ḍe ninnum̐ gūḍĕ
bĕṁḍuseya nīgele pĕravārigim̐ gāga