నెలఁతఁ గరుణించితి నెరజాణఁడవు నీవు
(॥పల్లవి॥)
నెలఁతఁ గరుణించితి నెరజాణఁడవు నీవు
నెలకొంటి విఁక నిట్టె నిండుకొనవయ్యా
(॥నెలఁ॥)
కాంతపై నీచూపులనేక లువలు చల్లి
దొంతిఁబెట్టితి వలపు తొలునాఁడే
బంతెనఁగూళ్లు నేఁడు పచ్చదోరణాలు నేఁడు
చింతదీర భోగించి చిత్తగించవయ్యా
(॥నెల॥)
పోదిగొని నవ్వులకప్పురములు ముంచి చల్లి
గాదెఁ బోసితి మోహము కలనాఁడే
గాదిలి గుజ్జనఁగూళ్ళు కమ్మనిబువ్వాలు నేఁడు
యీదెస దోమటి దొడి కిచ్చగించవయ్యా
(॥నెలఁ॥)
ఆసపాటుమాటల అధరపుఁ దేనె వూసి
రాసి చేసితివి మేలురతుల నాఁడే
వాసికి శ్రీవేంకటేశ వంతుల విందులు నేఁడే
సేసవెట్టి కూడితి వచ్చికములేదయ్యా
(||pallavi||)
nĕlam̐tam̐ garuṇiṁchidi nĕrajāṇam̐ḍavu nīvu
nĕlagŏṁṭi vim̐ka niṭṭĕ niṁḍugŏnavayyā
(||nĕlam̐||)
kāṁtabai nīsūbulanega luvalu salli
dŏṁtim̐bĕṭṭidi valabu tŏlunām̐ḍe
baṁtĕnam̐gūḽlu nem̐ḍu pachchadoraṇālu nem̐ḍu
siṁtadīra bhogiṁchi sittagiṁchavayyā
(||nĕla||)
podigŏni navvulagappuramulu muṁchi salli
gādĕm̐ bosidi mohamu kalanām̐ḍe
gādili gujjanam̐gūḽḽu kammanibuvvālu nem̐ḍu
yīdĕsa domaḍi dŏḍi kichchagiṁchavayyā
(||nĕlam̐||)
āsabāḍumāḍala adharabum̐ denĕ vūsi
rāsi sesidivi meluradula nām̐ḍe
vāsigi śhrīveṁkaḍeśha vaṁtula viṁdulu nem̐ḍe
sesavĕṭṭi kūḍidi vachchigamuledayyā