Nelamtagum jeemkadi neege vennela

నెలఁతకుఁ జీఁకటి నీకే వెన్నెల
Language

(॥పల్లవి॥)
నెలఁతకుఁ జీఁకటి నీకే వెన్నెల
చలువయు వేఁడియు సంగడిఁ గలిగె

(॥॥)
వాడినమోమును వంచినశిరసును
యేడఁ గలిగెనో యీచెలికి
వీడెపుమోవియు వేడుకనవ్వులు-
నీడనే రమణుఁడ నీకే కలిగె

(॥॥)
చెక్కుమీఁదిచేయి చెదరిననెరులును
యెక్కడఁ గలిగెనో యీచెలికి
తక్కినకళలును తనువుచెమటలును
నిక్కపుదొరవగునీ కే కలిగె

(॥॥)
తొట్టినతమకము తొడుసగువెరగులు
యెట్టు గలిగెనో యీచెలికి
యిట్టె శ్రీ వేంకటేశ కూడితివి
నెట్టన సతిరతి నీకే కలిగె

(||pallavi||)
nĕlam̐tagum̐ jīm̐kaḍi nīge vĕnnĕla
saluvayu vem̐ḍiyu saṁgaḍim̐ galigĕ

(||||)
vāḍinamomunu vaṁchinaśhirasunu
yeḍam̐ galigĕno yīsĕligi
vīḍĕbumoviyu veḍuganavvulu-
nīḍane ramaṇum̐ḍa nīge kaligĕ

(||||)
sĕkkumīm̐diseyi sĕdarinanĕrulunu
yĕkkaḍam̐ galigĕno yīsĕligi
takkinagaḽalunu tanuvusĕmaḍalunu
nikkabudŏravagunī ke kaligĕ

(||||)
tŏṭṭinadamagamu tŏḍusaguvĕragulu
yĕṭṭu galigĕno yīsĕligi
yiṭṭĕ śhrī veṁkaḍeśha kūḍidivi
nĕṭṭana sadiradi nīge kaligĕ